Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వారణాసి పార్లమెంటరీ నియోజకవర్గానికి చెందిన గ్రామ ప్రధాన్ లతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషణ

వారణాసి పార్లమెంటరీ నియోజకవర్గానికి చెందిన గ్రామ ప్రధాన్ లతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషణ


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వారణాసి పార్లమెంటరీ నియోజకవర్గం నుండి వచ్చిన గ్రామ ప్రధాన్ లను ఈ రోజు న్యూ ఢిల్లీ లోని తన నివాసంలో సత్కరించారు. వారణాసి పార్లమెంటరీ నియోజకవర్గం నుండి వచ్చి ప్రధాన మంత్రి తో భేటీ అయిన ఇటువంటి బృందాలలో ఇది మూడోది.

ప్రధాన్ లతో ముచ్చటించిన ప్రధాన మంత్రి భూ స్వస్థత కార్డు పథకం, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన మరియు ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన ల వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలను గురించి వారి వారి గ్రామాల ప్రజలకు వివరంగా తెలియజెప్పవలసిందిగా సూచించారు.