Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వరదల బారిన పడిన వేరు వేరు రాష్ట్రాలలో రక్షణ, సహాయక కార్యకలాపాలకు పూర్తి అండదండలు అందిస్తామని ప్రధాన మంత్రి హామీ ఇచ్చారు


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వరదలకు గురైన ఉత్తర ప్రదేశ్, బిహార్, ఉత్తరాఖండ్, రాజస్థాన్ ఇంకా మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో రక్షణ మరియు సహాయక కార్యకలాపాల నిర్వహణకు పూర్తి అండదండలు అందిస్తామని హామీ ఇచ్చారు. వరదల కారణంగా కష్టాల పాలైన వారంతా సురక్షితంగాను, క్షేమంగాను ఉండాలని ప్రార్థిస్తున్నానని ఆయన అన్నారు. ప్రభావిత ప్రాంతాలలో పరిస్థితి సాధ్యమైనంత త్వరగా సాధారణ స్థితికి చేరుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.

“వరదలు ముంచెత్తిన ఉత్తర ప్రదేశ్, బిహార్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలల్లోని ప్రాంతాల ప్రజలు సురక్షితంగా, క్షేమంగా ఉండాలని ప్రార్ధిస్తున్నాను.

హోం మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. ఆయన ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. అక్కడ చేపడుతున్న రక్షణ, సహాయక కార్యకలాపాలను గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ రక్షణ, సహాయక కార్యకలాపాల అమలులో కేంద్రం పూర్తి అండదండలను అందిస్తుంది. వరద బాధిత ప్రాంతాలు వీలైనంత త్వరలోనే సాధారణ స్థితికి చేరుకోవాలని నేను ఆశిస్తున్నాను” అని ప్రధాన మంత్రి అన్నారు.