పిఎంఇండియా
అపరాధుల అప్పగింతకు భారతదేశం మరియు అఫ్గానిస్తాన్ ల మధ్య ఒక ఒడంబడికపై సంతకాలు మరియు ధ్రువీకరణ ప్రతిపాదనలను మంత్రిమండలి ఆమోదించింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు.
ఈ ఒడంబడిక అఫ్గానిస్తాన్ ఉగ్రవాదులు, ఆర్థిక నేరాలకు ఒడిగట్టిన వారు మరియు ఇతర నేరస్తులను భారతదేశానికి అప్పగించేటందుకు, అలాగే అటువంటి వారిని భారతదేశం కూడా అఫ్గానిస్తాన్ కు అప్పగించేటందుకు సంబంధించి ఒక చట్టబద్ధమైన స్వరూపాన్ని రూపొందించడానికి వెసులుబాటు కల్పించనున్నది.