ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దేవగఢ్‌లో దేవ్గఢ్లో రూ.16,800 కోట్లకుపైగా విలువైన వివిధ అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ రమేష్ బైస్, ముఖ్యమంత్రి శ్రీ హేమంత్ సోరెన్, కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- బాబా బైద్యనాథ్ ఆశీస్సులతో నేడు రూ.16,800 కోట్లకుపైగా విలువైన వివిధ అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశామని పేర్కొన్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో ఆధునిక అనుసంధానం, విద్యుత్, ఆరోగ్యం, ధర్మం, పర్యాటకం తదతర రంగాలకు ఎనలేని ఊపునిస్తాయని చెప్పారు. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి ముడిపడి ఉన్నదనే సూత్రం ఆధారంగా ఎనిమిదేళ్ల నుంచీ దేశం శ్రమిస్తున్నదని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ కర్తవ్య నిర్వహణ సూత్రం ఆధారంగానే గత 8 సంవత్సరాలుగా జార్ఖండ్‌ను జాతీయ రహదారులు, రైలు-విమాన-జల మార్గాలతో అనుసంధానించేందుకు అన్నివిధాలా కృషి సాగుతున్నదని ఆయన గుర్తుచేశారు. ఈ మౌలిక వసతులన్నీ రాష్ట్ర ఆర్థికాభివృద్ధిపై సానుకూల ప్రభావం చూపుతాయని చెప్పారు.
జార్ఖండ్‌లో నేడు రెండో విమానాశ్రయం అందుబాటులోకి వస్తోందని ప్రధాని అన్నారు. ఇది బాబా బైద్యనాథ్ భక్తులకు ఎనలేని సౌలభ్యాన్నిస్తుందని తెలిపారు. ఉడాన్ పథకం ద్వారా సామాన్యులకు విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ కృషి ఫలితాలు ఇవాళ దేశమంతటా ప్రస్ఫుటం అవుతున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఉడాన్ పథకం కింద గత 5-6 ఏళ్లలో విమానాశ్రయాలు, హెలిపోర్టులు, జల విమానాశ్రయాల ద్వారా దాదాపు 70 కొత్త ప్రదేశాలు సంధానించబడినట్లు తెలిపారు. నేడు సాధారణ పౌరులకు 400కుపైగా కొత్త మార్గాల్లో విమానయాన సౌకర్యం లభిస్తోందని పేర్కొన్నారు. దీంతో ఇప్పటిదాకా కోటి మందికిపైగా సామాన్యులు చాలా సరసమైన ధరతో విమానయాన అనుభవం పొందారని, వీరిలో చాలామంది తొలిసారి ప్రయాణికులేనని వెల్లడించారు. దేవగఢ్ నుంచి కోల్‌కతాకు ఇవాళ్టినుంచి ప్రారంభమైన విమానయాన సేవలు త్వరలోనే రాంచీ, ఢిల్లీ, పాట్నాలకు విస్తరించనున్నాయని ప్రధాని హర్షం వెలిబుచ్చారు. బొకారో, డుమ్కా నగరాల్లోనూ విమానాశ్రయాల ఏర్పాటు దిశగా పనులు సాగుతున్నాయని ఆయన చెప్పారు.
దేశంలో అనుసంధానంతోపాటు ధర్మం-ఆధ్యాత్మికత సంబంధిత కీలక ప్రదేశాలలో సౌకర్యాల కల్పనపైనా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. ఇందులో భాగంగా ‘ప్రసాద్’ పథకం కింద బాబా బైద్యనాథ్ ధామ్‌లో ఆధునిక సౌకర్యాలు విస్తరించబడ్డాయని వివరించారు. ఒక సమగ్ర విధానంతో ప్రాజెక్టులకు మార్గనిర్దేశం చేసినప్పుడు సమాజంలోని వివిధ వర్గాలకు కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడటమేగాక కొత్త సౌకర్యాల వల్ల కొత్త అవకాశాలు కూడా సృష్టించబడతాయని తెలిపారు. గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను పెంపొందించేందుకు దేశం చేస్తున్న కృషితో జార్ఖండ్ రాష్ట్రానికి ఒనగూడే ఫలితాల గురించి కూడా ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఇందులో భాగంగా ‘ప్రధానమంత్రి ఊర్జ గంగా యోజన’ పాత స్వరూపాన్ని మారుస్తున్నామని చెప్పారు. “లేమిని అవకాశాలుగా మార్చుకునే దిశగా మేము అనేక చారిత్రక నిర్ణయాలు తీసుకుంటున్నాం” అని ఆయన చెప్పారు. గెయిల్ పరిధిలోని జగదీష్పూర్-హల్దియా-బొకారో-ధమ్రా పైప్‌లైన్‌లో భాగమైన బొకారో-అంగుల్ విభాగం జార్ఖండ్, ఒడిషా రాష్ట్రాల్లోని 11 జిల్లాల్లో నగర గ్యాస్ పంపిణీ నెట్వర్కును విస్తరింపజేస్తుందని వెల్లడించారు.
“సబ్కా సాథ్.. సబ్కా వికాస్.. సబ్కా విశ్వాస్.. సబ్కా ప్రయాస్” అన్నదే తమ తారకమంత్రమని ప్రధానమంత్రి చెప్పారు. మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టడం ద్వారా అభివృద్ధి, ఉపాధి, స్వయం ఉపాధి దిశగా కొత్త మార్గాలు ఏర్పాడుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా జార్ఖండ్ రాష్ట్రానికి లభిస్తున్న ప్రయోజనాలు నొక్కిచెబుతూ- ‘మేము అభివృద్ధి ఆకాంక్షకు ప్రాధాన్యం ఇచ్చాం.. ప్రగతికాంక్షిత జిల్లాలపై దృష్టి కేంద్రీకరించాం’ అని వివరించారు. స్వాతంత్య్రం సిద్ధించిన చాలాకాలం తర్వాత విద్యుదీకరించిన 18 వేల గ్రామాల్లో అధికశాతం దారీతెన్నూలేని మారుమూల ప్రాంతాల్లో ఉన్నవేనని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలకు కొళాయి నీటి సరఫరా, రోడ్ల నిర్మాణం, గ్యాస్ కనెక్షన్లను చేరువ చేసేందుకు గత 8 సంవత్సరాలుగా ప్రభుత్వం ఉద్యమ తరహాలో కృషి చేసిందని ఆయన గుర్తుచేశారు. ఆధునిక సదుపాయాలు నేడు పెద్ద నగరాలను దాటి విస్తరించడాన్ని ప్రస్తావిస్తూ- సామాన్య పౌరుల జీవన సౌలభ్యం మెరుగుకు చర్యలు తీసుకుంటే జాతీయ ఆస్తులు సృష్టించబడి జాతీయ అభివృద్ధికి కొత్త అవకాశాలు అందివస్తాయని చెప్పడానికి ఈ ప్రాజెక్టులే నిదర్శనమని ప్రధానమంత్రి అన్నారు. “ఇది సరైన అభివృద్ధి.. ఈ ప్రగతి దిశగా మనం సమష్టి కృషిని మరింత వేగిరపరచాలి” అని ఆయన పిలుపునిచ్చారు.
దేవగఢ్‌లో అభివృద్ధి ప్రాజెక్టులు
***
Development projects being launched in Jharkhand will significantly boost connectivity and ensure ease of living for the people. https://t.co/pqwhm1zZPm
— Narendra Modi (@narendramodi) July 12, 2022
बाबा वैद्यनाथ के आशीर्वाद से आज 16 हज़ार करोड़ रुपए से अधिक के प्रोजेक्ट्स का लोकार्पण और शिलान्यास हुआ है।
— PMO India (@PMOIndia) July 12, 2022
इनसे झारखंड की आधुनिक कनेक्टिविटी, ऊर्जा, स्वास्थ्य, आस्था और पर्यटन को बहुत अधिक बल मिलने वाला है: PM @narendramodi
राज्यों के विकास से राष्ट्र का विकास, देश पिछले 8 वर्षों से इसी सोच के साथ काम कर रहा है।
— PMO India (@PMOIndia) July 12, 2022
पिछले 8 वर्षों में highways, railways, airways, waterways, हर प्रकार से झारखंड को कनेक्ट करने के प्रयास में भी यही सोच, यही भावना सर्वोपरि रही है: PM @narendramodi
आज सरकार के प्रयासों का लाभ पूरे देश में दिख रहा है।
— PMO India (@PMOIndia) July 12, 2022
उड़ान योजना के तहत पिछले 5-6 सालों में लगभग 70 नए स्थानों को एयरपोर्ट्स, हेलीपोर्ट्स और वॉटर एयरोडोम्स के माध्यम से जोड़ा गया है।
400 से ज्यादा नए रूट्स पर आज सामान्य से सामान्य नागरिक को हवाई यात्रा की सुविधा मिल रही है: PM
कनेक्टिविटी के साथ-साथ देश के आस्था और आध्यात्म से जुड़े महत्वपूर्ण स्थलों पर सुविधाओं के निर्माण पर भी केंद्र सरकार बल दे रही है।
— PMO India (@PMOIndia) July 12, 2022
बाबा बैद्यनाथ धाम में भी प्रसाद योजना के तहत आधुनिक सुविधाओं का विस्तार किया गया है: PM @narendramodi
हम सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास के मंत्र पर चल रहे हैं।
— PMO India (@PMOIndia) July 12, 2022
इंफ्रास्ट्रक्चर में निवेश कर विकास के, रोज़गार-स्वरोज़गार के नए रास्ते खोजे जा रहे हैं।
हमने विकास की आकांक्षा पर बल दिया है, आकांक्षी जिलों पर फोकस किया: PM @narendramodi