Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో భక్తి సంగీత కార్యక్రమంలో యువత ఉత్సాహాన్ని అభినందించిన ప్రధానమంత్రి


ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లా నమో ఘాట్‌లో నిర్వహించిన భక్తి సంగీత విభావరి (భజన్‌ క్లబ్బింగ్‌) కార్యక్రమంలో యువత ఉత్సాహంగా పాల్గొనడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఈ కార్యక్రమం అక్కడికి వచ్చిన వారందరినీ మంత్రముగ్ధులను చేసింది.

“నా యువ మిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక శోభను తీసుకొచ్చింది. వారి ఉత్సాహం, ఉల్లాసం చూడముచ్చటగా ఉన్నాయి” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

“బాబా విశ్వనాథుని పుణ్యక్షేత్రమైన కాశీలో నిర్వహించిన భక్తి భజనల సంగీత వేడుక అందరినీ మంత్రముగ్ధులను చేసింది. నమో ఘాట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో నా యువ మిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వారి ఉత్సాహం, ఆనందం చూడముచ్చటగా ఉన్నాయి” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.

****