Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శుభ్రత సంబంధిత కార్యకలాపాలలో పాలుపంచుకొన్నవారికి ప్రధాన మంత్రి అభినందనలు


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభ్రత సంబంధిత కార్యకలాపాలలో పాలుపంచుకొన్నవారిని అభినందించారు.

ప్రజల వద్ద నుండి శుభ్రత పరిరక్షణ కార్యక్రమాల తాలూకు చిత్రాలను, వీడియో లను కూడా ప్రధాన మంత్రి ఆహ్వానించారు.

“అక్టోబరు రెండో తారీఖు వచ్చేస్తోంది, శుభ్రత సంబంధిత కార్యకలాపాల పట్ల ఎంతో ఉత్సుకత వ్యక్తం కావడాన్ని నేను గమనిస్తున్నాను. వాటిలో పాలుపంచుకొంటున్నవారందరికీ అభినందనలు.

మీరు పాల్గొనే శుభ్రత పరిరక్షణ కార్యకలాపాలకు సంబంధించిన దృశ్యాలను గాని, లేదా వీడియో ను గాని యాప్ పై పంచుకోండి. వాటిలో నుండి కొన్నింటిని సోషల్ మీడియా లో ఇతరులతో షేర్ చేస్తాను” అని ప్రధాన మంత్రి తమ సందేశంలో పేర్కొన్నారు.