Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌వాసి భార‌తీయ కేంద్రాన్ని ప్రారంభించిన ప్ర‌ధాని

ప్ర‌వాసి భార‌తీయ కేంద్రాన్ని ప్రారంభించిన ప్ర‌ధాని

ప్ర‌వాసి భార‌తీయ కేంద్రాన్ని ప్రారంభించిన ప్ర‌ధాని


ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ న్యూఢిల్లీలో ప్ర‌వాసి భార‌తీయ కేంద్రాన్ని ప్రారంభించారు.

ఇలాంటి కార్య‌క్ర‌మం నిర్వ‌హ‌ణ‌కు మ‌హాత్మాగాంధీ, మాజీ ప్ర‌ధాని లాల్‌బ‌హ‌దూర్ శాస్త్రి జ‌యంతిని మించిన సంద‌ర్భం మ‌రొక‌టుండ‌ద‌ని ప్ర‌ధాని ఈ సంద‌ర్భంగా అన్నారు. మ‌హాత్మాగాంధీ దేశాన్ని వ‌దిలి వెళ్ళి జాతి నిర్మాణం పిలుపుతో తిరిగి వ‌చ్చార‌ని ఆయ‌న చెప్పారు.
విదేశాల్లో నివ‌శిస్తున్న భార‌తీయ సంత‌తి ప్ర‌జ‌ల‌ను కేవ‌లం సంఖ్యాప‌రంగా కాకుండా బ‌లం ఆధారంగా చూడాల‌ని ప్ర‌ధాని అన్నారు. “బ్రెయిన్ డ్రెయిన్” (మేథోవ‌ల‌స‌) కాలం చెల్లిపోయిన మాట అని ఆయ‌న వ్యాఖ్యానించారు. మ‌న ప్ర‌వాస భార‌తీయుల బ‌లాన్ని బ‌ట్టి దాన్ని ” బ్రెయిన్ గెయిన్” గా (మేథో లాభం) మార్చాల్సిన అవ‌స‌రం ఉందని ఆయ‌న చెప్పారు.

ప్ర‌పంచం యావ‌త్తు మ‌నతో క‌లిసి ప్ర‌యాణం చేసేందుకు ఎంతో ఆస‌క్తి ప్ర‌ద‌ర్శిస్తున్న త‌రుణంలో “మ‌న‌కి తెలియ‌ని వారు అనే భ‌యం” పురోగ‌తికి ప్ర‌ధాన అవ‌రోధం అవుతుంద‌ని హెచ్చ‌రిస్తూ ఈ భ‌యాన్ని దాటేందుకు ప్ర‌వాస భార‌తీయులు స‌హాయ‌కారిగా నిలుస్తార‌ని ప్ర‌ధాని చెప్పారు.

ప్ర‌పంచంలోని ప‌లు దేశాల్లో నివ‌శిస్తున్న ప్ర‌వాస భార‌తీయుల‌తో అనుసంధానం కావ‌ల‌సిన అవ‌స‌రాన్ని నొక్కి చెబుతూ మాజీ ప్ర‌ధాని అట‌ల్ బిహారీ వాజ్ పేయి ప్ర‌వాసి భార‌తీయ అనే భావనను ఆవిష్క‌రించార‌ని, ఆ త‌ర్వాత వ‌చ్చిన ప్ర‌భుత్వాల‌న్నీ దాన్ని అనుస‌రిస్తూ వ‌చ్చాయ‌ని ప్ర‌ధాని తెలిపారు.

గ‌త రెండేళ్ళ కాలంలో భార‌త‌దేశం ప్ర‌త్యేకించి విదేశాంగ మంత్రిత్వ శాఖ మాన‌వ‌తాపూర్వ‌క‌మైన కృషి ఎంతో చేసిందని ప్ర‌ధాని తెలిపారు. ఒక్క భార‌తీయుల‌నే కాదు…ప‌లు దేశాల పౌరుల‌ను సంఘ‌ర్ష‌ణ‌లు, వైప‌రీత్యాలు చెల‌రేగిన ప్రాంతాల నుంచి ర‌క్షించిన విష‌యం ఆయ‌న గుర్తు చేశారు.

భార‌త్ ఎన్న‌డూ మ‌రో జాతిపై దాడి చేయ‌లేద‌ని ప్ర‌ధాని చెప్పారు. రెండు ప్ర‌పంచ యుద్ధాల స‌మ‌యంలోనూ విదేశీ భూభాగాల‌ను కాపాడేందుకు భార‌త సైనికులు ప్రాణాలు ఫ‌ణంగా పెట్టిన విష‌యం ఆయ‌న గుర్తు చేశారు. ఈ త్యాగాల‌ను ప్ర‌పంచం గుర్తించాల్సి ఉన్న‌ద‌ని ఆయ‌న అన్నారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని “గాంధీ-ఏక్ ప్ర‌వాసి” ప్ర‌ద‌ర్శ‌న‌ను తిల‌కించారు. మ‌ధుమేహం అదుపులో ఉంచేందుకు యోగా అనే పుస్త‌కాన్ని కూడా ఆయ‌న ఆవిష్క‌రించారు. “నో ఇండియా క్విజ్‌” లో గెలిచిన వారికి ప్ర‌ధాని బ‌హుమ‌తులు అంద‌చేశారు.