Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సమ్మిళిత అభివృద్ధి, దేశ నిర్మాణం.. వీటి ప్రాధాన్యాన్ని చాటిచెప్పే


సర్వతోముఖ అభివృద్ది పౌరుల జీవితాల్లో సానుకూల మార్పును తీసుకువస్తున్నప్పుడు దేశ ప్రగతికి ఒక కొత్త జోరు లభిస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ స్ఫూర్తిదాయక భావనతోనే భారత్ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడానికి దేశ ప్రజలు నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.

‘‘కన్యానాం సంప్రదానంచ కుమారాణాంచ రక్షణమ్ రాష్ట్రస్య సంగ్రహే నిత్యం విధానమిదమాచరేత్’’ అనే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి పంచుకున్నారు.

మహిళల సంక్షేమాన్ని నిర్ధారించడం, యువతరాన్ని కాపాడుతూ వారిని పోషించడం, దేశ ఏకత, భద్రత, సౌభాగ్యం, సుపరిపాలనల కోసం అవసరమైన ఏర్పాట్లను నిరంతరం చేస్తుండడం ప్రజా ప్రతినిధుల కర్తవ్యమని ఈ సుభాషితం సూచిస్తోంది.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:

‘‘సర్వతోముఖ అభివృద్ధితో దేశంలో ప్రతి ఒక్కరి జీవితంలో సకారాత్మక పరివర్తనకు బాట పడినప్పుడు దేశ ప్రగతికి ఒక కొత్త వేగం తోడవుతుంది. ఇదే స్ఫూర్తిదాయక భావనతో, భారత్ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో మనమందరం నిమగ్నమై ఉన్నాం.

‘‘కన్యానాం సంప్రదానంచ కుమారాణాంచ రక్షణమ్

రాష్ట్రస్య సంగ్రహే నిత్యం విధానమిదమాచరేత్’’ అని పేర్కొన్నారు.

 

****