పిఎంఇండియా
బిఆర్ ఐ సి ఎస్ (బ్రిక్స్) దేశాలు కొత్తగా ఏర్పాటు చేసుకున్న న్యూ డెవలప్ మెంట్ బ్యాంకు (ఎన్ డిబి) తో బ్రిక్స్ ఇంటర్ బ్యాంక్ సహకార యంత్రాంగం ద్వారా ప్రభుత్వ స్థాయిలో ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి/భారతీయ ఎగుమతులు, దిగుమతుల బ్యాంకు సా(ఎగ్జిమ్ బ్యాంకు) సాధారణ సహకారం అందించుకొనేందుకు సంబంధించిన ఒక అవగాహనాపూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ ఒ యు)పై సంతకాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఈ ప్రతిపాదన బ్రిక్స్ దేశాల మధ్య ఆర్థిక మరియు వాణిజ్య బంధాన్ని పెంపొందించగలదు. ఈ ఎమ్ ఒ యు పై సంతకాలు చేయడం వల్ల ఎటువంటి ఆర్థిక భారం పడదు. బ్రిక్స్ దేశాలకు చెందిన సంస్థలు ఈ ఎమ్ ఒ యు వల్ల లాభపడతాయి.
వివిధ దేశాల్లోని జాతీయ చట్టాలు, నియంత్రణల పరిధిలోనే సహకారం విస్తృతికి అవకాశం కల్పించే ఎలాంటి కట్టుబాటు లేని ఎమ్ ఒ యు ఇది. దీనిపై సంతకాలు చేసే దేశాల మధ్య నైపుణ్యాలు, జ్ఞాన సంపద బదిలీకి వీలు కలుగుతుంది. ఎన్ డిబి స్థాపన బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని మరింతగా బలోపేతం చేయడంతో పాటు పరస్పర సహకారానికి బలమైన సాధనాన్ని సమకూర్చనుంది. అలాగే, అంతర్జాతీయంగా భారతదేశం మరింత చురుకైన పాత్రను పోషించేందుకు వీలు కలుగుతుంది. బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్య, సేవా విభాగాలలో బంధాన్ని మరింత పటిష్ఠం చేసుకోవడం, వివిధ ప్రాజెక్టులకు పరస్పరం పెట్టుబడులు సమకూర్చుకోవడం వంటి కోణాల్లో చూసినా ఈ ఎమ్ ఒ యు అత్యంత కీలకం. స్థిరమైన అభివృద్ధి, సమ్మిళిత ఆర్థిక వృద్ధిపరంగా కూడా ఈ ఎమ్ ఒ యు అత్యంత వ్యూహాత్మకమైనది.
పూర్వ రంగం:
బ్రిక్స్ దేశాలు, వ్యవస్థల మధ్య వాణిజ్య, ఆర్థిక సహకారం మరింత పెంచుకొనే లక్ష్యంతో ఆ దేశాలకు చెందిన అయిదు బ్యాంకులు అంతర్గత బ్యాంకింగ్ సహకార వ్యవస్థనొకదానిని ఏర్పాటు చేసుకొన్నాయి. ఇందుకు అనుగుణంగా ఎన్ డిబితో వివిధ అంశాలలో సహకారం కోసం ఒక ఎమ్ ఒయు పై సంతకాలు చేయాలని బ్రిక్స్ ఇంటర్ బ్యాంక్ కో-ఆపరేషన్ మెకానిజం ప్రస్తుతం ప్రతిపాదించింది.
***