పిఎంఇండియా
ఇండియన్ పోస్ట్స్ & టెలికమ్యూనికేషన్స్ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ విభాగంలో (ఐ పి & టి ఎ ఎఫ్ ఎస్) ఫస్ట్ కేడర్ రివ్యూకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు.
ప్రధానాంశాలు:
(a) కేడర్ మొత్తం సంఖ్య 420 నుంచి 376కి తగ్గింపు;
(b) అత్యున్నత స్థాయిలో కంట్రోలర్ జనరల్ ఆఫ్ కమ్యూనికేషన్ అకౌంట్స్ (సి జి సి ఎ) ఏర్పాటు;
(c) ఒక అదనపు హెచ్ ఎ జి ప్లస్ స్థాయి పోస్టు ఏర్పాటు, పోస్టులు 2 కు పెంపు;
(d) రెండు అదనపు హెచ్ ఎ జి స్థాయి పోస్టుల ఏర్పాటు, పోస్టులు 6 నుండి 8కి పెంపు;
(e) 18 అదనపు ఎస్ ఎ జి స్థాయి పోస్టుల ఏర్పాటు, పోస్టుల సంఖ్య 37 నుండి 55కు పెంపు;
(f) జె ఎ జి స్థాయి పోస్టుల సంఖ్య 111 నుండి 90కి తగ్గింపు;
(g) ఎస్ టి ఎస్ స్థాయి పోస్టుల సంఖ్య 198 నుంచి 86కి తగ్గింపు;
(h) 21 జె టి ఎస్ స్థాయి పోస్టుల ఏర్పాటు, పోస్టుల సంఖ్య 67 నుంచి 88కి పెంపు;
(i) రిజర్వ్ గా 46 పోస్టుల ఏర్పాటు.
పూర్వ రంగం:
టెలికమ్యూనికేషన్ల శాఖ (డి ఒ టి), తపాలా శాఖ (డి ఒ పి) అవసరాలు తీర్చడానికి 1972లో ఇండియన్ పోస్ట్స్ & టెలికమ్యూనికేషన్స్ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ విభాగంలో “గ్రూప్ ఎ” సర్వీసును ఏర్పాటు చేశారు.
టెలికమ్యూనికేషన్ల శాఖలో ఐ పి & టి ఎ ఎఫ్ ఎస్ విభాగం లైసెన్స్ ఫీజు/స్పెక్ర్టమ్ యూసేజ్ చార్జీల మదింపు, వసూలు బాధ్యతలతో పాటు స్పెక్ర్టమ్ వేలం,యు ఎస్ ఒ స్కీమ్ పర్యవేక్షణ, సబ్సిడీ మేనేజ్ మెంట్, ఖజానా నిర్వహణ, బడ్జెటింగ్, అకౌంటింగ్, పింఛన్ల పంపిణీ, అంతర్గత ఆడిట్, ఆర్థిక వ్యవహారాలపై సలహాలు అందించడం వంటి విధులు నిర్వర్తిస్తుంది. తపాలా శాఖలో ఐ పి & టి ఎ ఎఫ్ ఎస్ విభాగానికి ఆర్థికపరమైన అంశాల్లో సలహాలివ్వడం, బడ్జెటింగ్, సుంకాలు మరియు వ్యయాలు, అకౌంటింగ్, అంతర్గత ఆడిట్ విధులను అప్పగించారు.
ఇటీవల కాలంలో టెలికమ్యూనికేషన్ల శాఖ, తపాలా శాఖల్లో విప్లవాత్మకమైన మార్పు చోటు చేసుకుంది. టెలికాం రంగంలో సర్వీస్ ప్రొవైడర్, రెగ్యులేటర్, విధాన రూపకర్త స్థాయి నుంచి విధాన నిర్ణేత, లైసెన్సింగ్, యు ఎస్ ఒ బాధ్యతల నిర్వహణ స్థాయికి టెలికమ్యూనికేషన్ల శాఖ పాత్ర పెరిగింది. టెలికమ్యూనికేషన్ల శాఖకు వచ్చే ఆదాయంలో లైసెన్స్ ఫీజు, స్పెక్ర్టమ్ వినియోగ చార్జీలు, స్పెక్ర్టమ్ వేలం ఫీజు (కేంద్ర ప్రభుత్వ ఖజానాకు సమకూరే పన్నేతర ఆదాయాల్లో అతి పెద్దది) ఉన్నాయి.
అలాగే తపాలా శాఖ అందించే సేవల్లో కూడా గుణాత్మకమైన, గణాత్మకమైన మార్పు చోటు చేసుకుంది. తపాలా శాఖ రిటైలింగ్, బ్యాంకింగ్, బీమా, డిజిటైజేషన్ వంటి కార్యకలాపాలు చేపట్టింది. రెండు శాఖల్లోను ఆడిట్ యంత్రాంగాన్ని పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉంది.
ఈ వాస్తవాలకు తోడు రెండు శాఖల్లోను గ్రేడ్ ల స్థాయిలో చలనరహిత స్థితి నెలకొనడం వల్ల ఐ పి & టి ఎ ఎఫ్ ఎస్ లో కేడర్ రివ్యూ అవసరమైంది.