Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

01.07.2016 నుంచి పింఛన్ దారులకు బకాయి ఉన్న డియర్ నెస్ రిలీఫ్, మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బకాయి ఉన్న డియర్ నెస్ అలవెన్స్ వాయిదా విడుదలకు మంత్రివర్గం ఆమోదం


ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్ నెస్ అలవెన్స్ (డిఎ) వాయిదాను మరియు పింఛన్ దారులకు డియర్ నెస్ రిలీఫ్ (డి ఆర్)ను విడుదల చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇది 01.07.2016 నుంచి వర్తించే విధంగా సవరించిన బేసిక్ పే / పెన్షన్ లో 2% పెంపును ప్రతిబింబిస్తుంది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ పెరుగుదల అంగీకారం కుదిరిన ఫార్ములా (ఏదయితే 7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల పై ఆధారపడిందో) కు అనుగుణంగా ఉంది.

డియర్ నెస్ అలవెన్స్ మరియు డియర్ నెస్ రిలీఫ్ లు రెండిటి మూలంగా ప్రభుత్వ ఖజానా పై పడే ఉమ్మడి భారం ఒక ఏడాదికి రూ. 5,622.10 కోట్లుగాను, 2016-17 ఆర్థిక సంవత్సరంలో 8 నెలల కాలానికి (2016 జులై నుండి 2017 ఫిబ్రవరి వరకు) రూ. 3,748.06 కోట్లుగాను ఉంటుంది. దాదాపు 50.68 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు మరియు 54.24 లక్షల పింఛన్ దారులు ప్రయోజనం పొందనున్నారు.