Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సమాచార సాంకేతిక విజ్ఞాన (ఐ టి) రంగంలో సహకారం కోసం భారతదేశానికి, వియత్నాం కు మధ్య ఎమ్ ఒ యు కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి


సమాచార సాంకేతిక విజ్ఞాన (ఐ టి) రంగంలో సహకారం కోసం భారతదేశానికి, వియత్నాం కు మధ్య అవగాహనపూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ ఒ యు)కు కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించారు.

పరస్పర ఆసక్తి వ్యక్తం అయ్యే సమాచార సాంకేతిక విజ్ఞాన రంగ సంబంధిత అంశాలలో సమానత్వం ప్రాతిపదికన ప్రతి ఒక్క దేశ చట్టాలు, నిబంధనావళికి అనుగుణంగా దీర్ఘకాలికమైన మరియు స్థిరమైన సహకారాన్ని నెలకొల్పడం ఈ ఎమ్ ఒ యు యొక్క ధ్యేయం. ఈ ఎమ్ ఒ యు అమలులోకి వస్తే సమాచార సాంకేతిక విజ్ఞాన రంగంలోను, మానవ వనరుల అభివృద్ధి రంగంలోను సంస్థాగతమైన నిర్మాణం మరియు సామర్థ్య నిర్మాణం ల ద్వారా గణనీయమైన ప్రయోజనాలు రెండు దేశాలకు సమకూరగలవు.

భారతదేశం, వియత్నాం లలో అయిదు సంవత్సరాల పాటు ఈ ఎమ్ ఒ యు అమలులో ఉంటుంది. అంతే కాక ఇరు పక్షాల లిఖితపూర్వక సమ్మతితో దీనిని నవీకరించుకొనేందుకు కూడా వీలు ఉంది. రెండు దేశాలకు చెందిన ప్రతినిధులతో కూడిన ఐ టి సంయుక్త కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేసి, ఈ ఎమ్ ఒ యును అమలుపరచనున్నారు.