Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

హిందుస్తాన్ యాంటి- బయోటిక్స్ లిమిటెడ్ అప్పులను తీర్చడం కోసం మిగులు స్థలంలో కొంత భాగం మరియు ఖాళీ స్థలం విక్రయానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం


హిందుస్తాన్ యాంటి- బయోటిక్స్ లిమిటెడ్ (హెచ్ఎఎల్) అప్పులను తీర్చడం కోసం ఆ సంస్థకు పుణె లోని పింప్రి లో ఉన్న మిగులు స్థలంలో కొంత భాగాన్ని మరియు ఖాళీ స్థలాన్ని విక్రయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించారు.

ఈ ప్రతిపాదనలో భాగంగా:

(i) మాఫీ, నిలిపి ఉంచిన కేసుల అనంతరం హెచ్ఎఎల్ కు ఉన్న రూ. 821.17 కోట్ల నికర అప్పులను తీర్చివేయడానికి మిగులు స్థలం మరియు ఖాళీ స్థలం కలుపుకొని దాదాపు 87.70 ఎకరాల స్థలాన్ని (బిఐఎఫ్ఆర్ మార్గదర్శక సూత్రాల ప్రకారం అందిన బిడ్ లను బట్టి వాస్తవంగా అమ్మవలసిన భూమి ఎంత అనేది ఆధారపడుతుంది) కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ సంస్థలు, కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలు, అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీస్ వగైరా ల నుండి బహిరంగ స్పర్ధాత్మక బిడ్ పద్ధతిలో విక్రయం చేపడుతారు.

(ii) భారత ప్రభుత్వ రుణం మరియు వడ్డీ కలుపుకొని రూ.307.23 కోట్ల వరకు మాఫీలు (అసలు రూ.186.96 కోట్లు మరియు దానిమీద 30.9.2017 నాటికి లెక్కతేలే వడ్డీ దాదాపుగా రూ.120.27 కోట్లు) ఉండగా, నిలిపి ఉంచిన వివిధ బకాయిలు రూ.128.68 కోట్ల వరకు ఉన్నాయి.

(iii) వేతనాలు, జీతాలు మరియు ఇతర వ్యయాలను దృష్టిలో ఉంచుకొని రూ.100 కోట్ల సత్వర రుణాన్ని మంజూరు చేయడం జరుగుతుంది. ఈ రుణాన్ని హెచ్ఎఎల్ భూమిని విక్రయించగా వచ్చే మొత్తంలో నుండి తిరిగి చెల్లిస్తారు.

ఈ ఆమోదం కంపెనీ యొక్క ఆస్తులను అత్యంత అనుకూలమైన రీతిలో వినియోగించడానికి ప్రభుత్వానికి ఉపయోగకారిగా ఉంటుంది. అంతే కాకుండా, కంపెనీ యొక్క

(i) పునరావాసం;

(ii) వ్యూహాత్మక విక్రయం; లేదా

(iii) మూసివేత

కోసం తదుపరి నిర్ణయాలు తీసుకోవడంలో దోహదకారిగా ఉంటుంది కూడా.
ఈ పథకం/ప్రతిపాదన అమలు చేసిన అనంతరం హెచ్ఎఎల్ స్థితి చక్కనై ఎటువంటి అప్పులు ఉండబోవు; ఆస్తులు -అప్పుల పట్టీ నిర్మలమవుతుంది. మంత్రుల సంఘం చేసిన సిఫారసుల అమలుకు వీలు ఏర్పడుతుంది.

మహారాష్ట్ర లోని పుణె లో ఉన్న పింప్రి వద్ద గల హెచ్ఎఎల్ భూమి విక్రయం ఉద్యోగుల కష్టాలను తగ్గించడానికి దోహదపడుతుంది. అప్పులు తీరిపోయి, ఆస్తులు -అప్పుల పట్టీ నిర్మలమైతే, మంత్రుల సంఘం సిఫారసుల అమలుకు మార్గం సుగమం అవుతుంది.

***