Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇరాన్ అధ్యక్షునిగా ఎన్నికైన శ్రీ మసూద్ పెజెశ్కియాన్ కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి


ఇస్లామిక్ గణతంత్రం ఇరాన్ అధ్యక్షునిగా ఎన్నికైన శ్రీ మసూద్ పెజెశ్కియాన్ కు అభినందనలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు.

ప్రధాన మంత్రి ఎక్స్ లో 

‘‘శ్రీ @drpezeshkian , మీరు ఇస్లామిక్ గణతంత్రం ఇరాన్ కు అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా మీకు ఇవే అభినందనలు. మన దేశాల ప్రజల ప్రయోజనాల కోసం, ఈ ప్రాంతం ప్రయోజనాల కోసం మన స్నేహపూర్ణ సంబంధాలు, మన దీర్ఘకాలిక ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా బలపరచడం కోసం మీతో కలసి పనిచేయాలన్న ఆశ నాలో ఉంది.’’ అని పేర్కొన్నారు.

***

DS/ST