పిఎంఇండియా
“శ్రీ నారాయణ గురు ఆదర్శాలు మానవాళి అందరికీ గొప్ప ఆస్తి” అని ప్రధాని వ్యాఖ్యానించారు. దేశానికి, సమాజానికి సేవ చేసే విషయంలో నిబద్ధతతో పనిచేయాలనుకునే వారికి శ్రీ నారాయణ గురు ఒక మార్గదర్శక రేఖగా నిలుస్తారని అన్నారు. సమాజంలో అణచివేత, దోపిడీకి గురైన వర్గాలతో పాటు అణగారిన ప్రజలతో తనకున్న చిరకాల సంబంధాన్ని ఆయన పంచుకున్నారు. ఈ వర్గాల అభ్యున్నతి కోసం తాను ప్రధాన నిర్ణయాలు తీసుకునేటప్పుడు గురుదేవున్ని గుర్తుకు తెచ్చుకుంటానని ప్రధానంగా చెప్పారు. శతాబ్దాల వలసలో జరిగిన వక్రీకరణల వల్ల 100 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితుల గురించి ఆయన మాట్లాడారు. ఆ సమయంలో ప్రబలంగా ఉన్న సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు ప్రజలు భయపడేవారని అన్నారు. అయితే శ్రీ నారాయణ గురు వ్యతిరేకతకు, సవాళ్లకు భయపడలేదని ఆయన పేర్కొన్నారు. సత్యం, సేవ, సద్భావనపై అపారమైన నమ్మకంతో కూడిన సామరస్యం, సమానత్వం విషయంలో ఆయన దృఢ నిశ్చయంతో ఉండేవారని అన్నారు. ఇదే మనకు ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ మార్గాన్ని చూపుతోందని తెలిపారు. చిట్ట చివరి స్థాయి వ్యక్తికి అత్యున్నత ప్రాధాన్యతనిచ్చే భారత్‌ను నిర్మించేందుకు ఈ నమ్మకమే శక్తినిస్తుందని పేర్కొన్నారు.
శివగిరి మఠంతో అనుబంధం ఉన్న వారితో పాటు సాధువులకు శ్రీ నారాయణ గురు, మఠం పట్ల తనకున్న లోతైన అచంచలమైన విశ్వాసం గురించి బాగా తెలుసని ప్రధాని ప్రధానంగా చెప్పారు. మఠంలోని గౌరవనీయులైన సాధువుల ప్రేమాభిమానాలు, ఆశీర్వాదాలు తనకు ఎల్లప్పుడూ దక్కాయని అన్నారు. ఈ సందర్భంగా 2013లో జరిగిన కేదార్‌నాథ్ వరదలను ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో శివగిరి మఠం నుంచి చాలా మంది వ్యక్తులు అక్కడ చిక్కుకుపోయారని, వారిని సురక్షితంగా తరలించే బాధ్యతను అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రికి మఠం అప్పగించిందని తెలిపారు. సంక్షోభ సమయాల్లో ఒకరి దృష్టి మొదటగా తమ సొంతమని భావించే, తనలో ఒకరని అనుకునే, వారి పట్ల బాధ్యత ఉందని భావించే వారిపై ఉంటుందని అన్నారు. శివగిరి మఠంలోని సాధువులు తనను బంధువుల భావిస్తారని, ఎంతో నమ్మకాన్ని చూపిస్తారని తెలిపారు. దీని కంటే గొప్ప ఆధ్యాత్మిక సంతృప్తి మరొకటి ఉండదని ఆయన వ్యాఖ్యానించారు.
కాశీతో తనకున్న సంబంధాని ప్రధానంగా చెబుతూ.. వర్కాలను చాలా కాలం నుంచి దక్షిణ కాశీగా పిలుస్తున్నారని అన్నారు. ఉత్తరాదిలో ఉన్నా, దక్షిణాదిలో ఉన్నా.. ప్రతి కాశీ తనదేనని వ్యాఖ్యానించారు. .
భారత ఆధ్యాత్మిక సంప్రదాయాల..ఋషులు, సిద్ధుల వారసత్వాన్ని దగ్గరగా అర్థం చేసుకొని జీవించే అదృష్టం తనకు లభించిందని మోదీ అన్నారు. దేశం సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడల్లా దేశంలోని ఏదో ఒక మూల నుంచి వచ్చిన ఒక గొప్ప వ్యక్తి సమాజానికి కొత్త మార్గాన్ని చూపించారని అన్నారు. ఇదే భారతదేశ ప్రత్యేకబలమని ప్రధానంగా చెప్పారు. కొందరు సమాజంలో ఆధ్యాత్మిక ఉద్ధరణకు కృషి చేశారని, మరికొందరు సామాజిక సంస్కరణలను వేగవంతం చేశారని పేర్కొన్నారు. అలాంటి గొప్ప సాధువు శ్రీ నారాయణ గురు అని ప్రధాని వ్యాఖ్యానించారు. ఆయన రాసిన ‘నివృత్తి పంచకం’, ‘ఆత్మోపదేశ శతకం’ వంటి రచనలు అద్వైత తత్వం, ఆధ్యాత్మికతను అధ్యయనం చేసే ఏ విద్యార్థికైనా మార్గదర్శకులుగా పనిచేస్తాయని పేర్కొన్నారు.
యోగా, వేదాంతం, ఆధ్యాత్మిక సాధన, మోక్షం అనే అంశాలు శ్రీ నారాయణ గురుకు ప్రధానమైన అంశాలని గుర్తుచేసిన మోదీ.. సామాజిక దురాచారాలలో చిక్కుకున్న సమాజంలో ఆధ్యాత్మికతను దాని సామాజిక పురోగతి ద్వారానే సాధించొచ్చని శ్రీ నారాయణ గురు భావించారని ప్రధానంగా చెప్పారు. ఆధ్యాత్మికతను సామాజిక సంస్కరణలు, ప్రజా సంక్షేమం కోసం ఒక మాధ్యమంగా ఆయన మార్చారని అన్నారు. మహాత్మాగాంధీ కూడా ఆయన చేసిన పనుల నుంచే ప్రేరణ, మార్గదర్శకత్వం పొందారని వ్యాఖ్యానించారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి వారు కూడా శ్రీ నారాయణ గురుతో చర్చల ద్వారా ప్రయోజనం పొందారని ప్రధాని అన్నారు.
శ్రీ నారాయణ గురు ఆత్మోపదేశ శతకంను ఎవరో రమణ మహర్షికి వినిపించిన సందర్భాన్ని ప్రస్తావించిన మోదీ.. దానిని విన్న రమణ మహర్షి “ఆయనకు అన్నీ తెలుసు” అని వ్యాఖ్యానించినట్లు తెలిపారు. విదేశీ భావజాలాలు భారతీయ నాగరికత, సంస్కృతి, తత్వశాస్త్రాన్ని అణగదొక్కడానికి ప్రయత్నించిన సమయాన్ని ఆయన గుర్తు చేశారు. మన లోపం మన అసలు సంప్రదాయాల్లో లేదని, మన ఆధ్యాత్మికతను నిజంగా లోతుగా సాధన చేయాల్సిన అవసరం ఉందని గ్రహించేలా ఆయన చేశారన్నారు. మనం ప్రతి మానవుడిలో నారాయణుడిని, ప్రతి జీవిలో ఈశ్వరున్ని చూసే వాళ్లమని ఆయన పేర్కొన్నారు. ద్వంద్వత్వంలో ద్వంద్వం కానితనాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని, స్పష్టమైన తేడాల్లో కూడా ఏకత్వాన్ని మనం చూస్తామని అన్నారు.
శ్రీ నారాయణ గురు మంత్రం – ‘ఒరు జాతి, ఒరు మతం, ఒరు దైవం, మనుష్యానుం’ అంటే ‘ఒకే కులం, ఒకే మతం, మానవాళికి ఒకే దేవుడు’ అనే మంత్రం అందరికీ తెలుసునని అన్నారు. ఇది మానవాళి, జీవుల ఐక్యతను తెలియజేస్తుందని పేర్కొన్నారు. ఈ తత్వశాస్త్రమే భారత నాగరికత తత్వానికి పునాదిగా నిలుస్తోందని ప్రధానంగా చెప్పారు. ప్రపంచ సంక్షేమ స్ఫూర్తితో ఈ తత్వాన్ని ప్రస్తుతం భారత్ విస్తరింపజేస్తోందని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ప్రధానంగా ప్రస్తావిస్తూ.. ఈ ఏడాది ఇతివృత్తం ‘ఒకే ధరిత్రి, ఒకే ఆరోగ్యం కోసం యోగా’ అని వ్యాఖ్యానించారు. ఇది ఒకే గ్రహం, సార్వత్రిక శ్రేయస్సు అనే దార్శనికతను సూచిస్తోందని తెలిపారు. గతంలో మానవాళి సంక్షేమం కోసం ‘ఒకే ప్రపంచం, ఒకే ఆరోగ్యం’ వంటి ప్రపంచ స్థాయి కార్యక్రమాలను కూడా భారత్ చేపట్టిందని పేర్కొన్నారు. ఇప్పుడు సుస్థిరాభివృద్ధి దిశగా జరుగుతోన్న ప్రపంచ స్థాయి ఉద్యమాలకు భారత్ నాయకత్వం వహిస్తోందని.. ‘ఒకే సూర్యుడు, ఒకే భూమి, ఒకే గ్రిడ్’ అనేది అందులో ఒకటని తెలిపారు. 2023లో జీ20 శిఖరాగ్ర సమావేశానికి భారత్ అధ్యక్షత వహించినప్పుడు అనుసరించిన ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ అనే ఇతివృత్తాన్ని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఇవన్నీ ‘వసుధైవ కుటుంబకం’ అనే స్ఫూర్తితో ఉన్నాయని, శ్రీ నారాయణ గురు వంటి సాధువులతో ప్రేరణ పొందాయని అన్నారు.
“వివక్ష లేని సమాజం గురించి శ్రీ నారాయణ గురు కలలు కన్నారు. నేడు దేశం సంతృప్త విధానాన్ని అనుసరించడం ద్వారా వివక్షకు అవకాశం ఉన్న ప్రతి దానిని తొలగిస్తోంది” అని మోదీ వ్యాఖ్యానించారు. 10, 11 సంవత్సరాల క్రితం పరిస్థితులను ప్రజలంతా గుర్తుకు తెచ్చుకోవాలని అన్నారు. అప్పటికి స్వాతంత్య్రం వచ్చి కొన్ని దశాబ్దాలైనప్పటికీ లక్షలాది మంది ప్రజలు చాలా క్లిష్ట పరిస్థితుల్లో జీవించవలసి వచ్చిందని అన్నారు. లక్షలాది కుటుంబాలకు ఆశ్రయం లేదని, లెక్కలేనన్ని గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో లేదని, ఆరోగ్య సంరక్షణ లేకపోవడం వల్ల చిన్న అనారోగ్యాలకు కూడా చికిత్స పొందలేని పరిస్థితి, తీవ్రమైన అనారోగ్య సందర్భాల్లో ప్రాణాలను కాపాడుకునే మార్గం లేని పరిస్థితి ఉండేదని ప్రధానంగా పేర్కొన్నారు. దళితులు, గిరిజనులు, మహిళలతో కూడిన లక్షలాది మంది పేదలుప్రాథమిక జీవన గౌరవాన్ని కోల్పోయారని అన్నారు. ఈ కష్టాలు తరతరాలుగా కొనసాగాయని, దీనివల్ల చాలామంది మెరుగైన జీవితం ఉంటుందనే ఆశనే వదులుకునే పరిస్థితి ఏర్పడిందని విచారం వ్యక్తం చేశారు. ఇంత భారీ సంఖ్యలో జనాభా బాధ, నిరాశతో జీవిస్తున్నప్పుడు దేశం ఎలా పురోగతి సాధించగలదని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ విధానాల్లో దయాగుణాన్ని కేంద్ర భాగంగా చేసి, సేవ చేయటాన్ని లక్ష్యంగా మార్చుకున్నట్లు ప్రధానంగా తెలిపారు. దీని ఫలితంగానే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లక్షలాది పేదలు, దళితులు, బాధిత, అణగారిన కుటుంబాలకు శాశ్వత గృహాలు కల్పించినట్లు పేర్కొన్నారు. ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని ఆయన పునరుద్ఘాటించారు. ఈ పథకంలో ఇచ్చిన ఇళ్లు కేవలం ఇటుక, సిమెంట్ నిర్మాణాలే కాకుండా.. అవసరమైన అన్ని సౌకర్యాలతో పూర్తి ఇళ్లు అనే భావనను లబ్ధిదారులకు ఇస్తున్నాయని అన్నారు. అందుకే ఈ పథకం కింద నిర్మించిన ఇళ్లు గ్యాస్, విద్యుత్, పారిశుద్ధ్య సౌకర్యాలతో ఉంటాయి. ప్రతి ఇంటికి పరిశుభ్రమైన నీటిని అందిస్తోన్న జల్ జీవన్ మిషన్ గురించి మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలు ఎప్పుడూ చేరుకోని గిరిజన ప్రాంతాలలో కూడా ఇప్పుడు అభివృద్ధికి హామీ లభిస్తోందని ప్రధానంగా పేర్కొన్నారు. అత్యంత అణగారిన గిరిజన వర్గాలకు ప్రధానమంత్రి జన్మన్ యోజనను తీసుకొచ్చామని, దీనితో అనేక ప్రాంతాలు అభివృద్ధి పథం వైపు నడుస్తున్నాయని అన్నారు. దీని కారణంగా సమాజంలోని అట్టడుగు స్థాయిలలో ఉన్నవారు కూడా సరికొత్త ఆశను పొందుతున్నారని వ్యాఖ్యానించారు. “ఈ కార్యక్రమాలు వారి జీవితాలను మార్చడమే కాకుండా, జాతి నిర్మాణంలో వాళ్లు కీలక పాత్ర పోషించేలా చేస్తున్నాయి” అని ఆయన అన్నారు.
మహిళల సాధికారతకు ప్రాధాన్యాన్ని ఇవ్వాలని శ్రీ నారాయణ గురు పదే పదే స్పష్టంచేస్తూ వచ్చారనీ, ‘మహిళల నాయకత్వంలో అభివృద్ధిని సాధించాలి’ అనే మంత్రంతో ప్రభుత్వం ముందుకు కదులుతోందనీ ప్రధానమంత్రి తెలిపారు. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడిచినా, మహిళలకు ప్రవేశం లేని రంగాలు అనేకం ఉన్నాయని ఆయన అన్నారు. ఈ ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసి, మహిళలు కొత్త కొత్త రంగాల్లో అడుగుపెట్టే స్థితిని కల్పించిందని ఆయన చెప్పారు. ఇవాళ… క్రీడలు మొదలు అంతరిక్షం వరకు… ప్రతి రంగంలోనూ మహిళలు దేశాన్ని గర్వపడేటట్లు చేస్తున్నారని శ్రీ మోదీ ప్రధానంగా ప్రస్తావించారు. సంఘంలోని ప్రతి ఒక్క వర్గం, ప్రతి ఒక్క విభాగం ప్రస్తుతం ‘అభివృద్ధి చెందిన భారత్’ కలను నిజం చేయడానికి తన వంతు తోడ్పాటును అందిస్తున్నాయని ప్రధానమంత్రి అన్నారు. ‘స్వచ్ఛ్ భారత్ మిషన్’, పర్యావరణ ప్రధాన ప్రచారోద్యమాలు, ‘అమృత్ సరోవర్’ల నిర్మాణం, చిరు ధాన్యాలపై జాగృతిని పెంచే కార్యక్రమాలను గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఈ ప్రయత్నాలు ప్రజల ఉత్సాహంతో, 140 కోట్ల మంది భారతీయుల అండదండలతో పురోగమిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు.శ్రీ నారాయణ గురు దృష్టికోణం అజరామరమని శ్రీ మోదీ వెల్లడించారు. ‘‘విద్య ద్వారా జ్ఞానం, కలిసి ఉండటం ద్వారా శక్తిమంతం కావడం, పరిశ్రమ ద్వారా సమృద్ధి’’… ఇదే శ్రీ నారాయణ గురు బోధించిందని ప్రధానమంత్రి అన్నారు. ‘‘శ్రీ నారాయణ గురు ఈ తరహా దార్శనికతను ప్రవచించడం ఒక్కటే కాకుండా, దీనిని సాకారం చేయడానికి వ్యవస్థాగత ఏర్పాట్లు కూడా చేశారు’’ అని శ్రీ మోదీ చెప్పారు. గురూజీ… శారదా మఠాన్ని ఏర్పాటు చేసింది శివగిరిలోనేననీ, దీనిని సరస్వతి దేవికి అంకితం చేశారని తెలిపారు. సమాజంలో ఆదరణకు నోచుకోని వర్గాల విముక్తికీ, వారి అభ్యున్నతికీ విద్య ఒక సాధనంగా తప్పక రూపొందాలనే విశ్వాసానికి ప్రతీకగా ఈ సంస్థ నిలిచిందని ఆయన ఉద్ఘాటించారు. గురుదేవ్ మొదలుపెట్టిన ప్రయత్నాలు ఈ రోజుకు కూడా దేశం నలుమూలలా అనేక నగరాలకు విస్తరిస్తూనే ఉన్నాయనీ, గురుదేవ్ సెంటర్లతో పాటు శ్రీ నారాయణ కల్చరల్ మిషన్ మానవ జాతి సంక్షేమానికి చురుకుగా పనిచేస్తోందనీ చెప్తూ శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.‘‘విద్య, సంస్థ, పారిశ్రామిక పురోగతి ద్వారా సాంఘిక సంక్షేమ సాధనకు సంబంధించిన దృష్టికోణం దేశం అనుసరిస్తున్న ప్రస్తుత విధానాల్లోనూ, తీసుకొంటున్న నిర్ణయాల్లోనూ స్పష్టంగా ప్రతిబింబిస్తోంది’’ అని ప్రధానమంత్రి అన్నారు. ఎన్నో దశాబ్దాల తరువాత, ఒక కొత్త జాతీయ విద్యావిధానాన్ని అమలు చేశామని ఆయన చెప్పారు. ఈ విధానం విద్యను ఆధునికీకరించడం ఒక్కటే కాకుండా విద్యను మరిన్ని వర్గాల వారి వద్దకు తీసుకు పోతుందనీ, మాతృభాషను నేర్చుకోవడాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. సమాజంలో నిరాదరణకు గురైన వర్గాల వారికి దీనివల్ల లబ్ది చేకూరిందని ఆయన స్ఫష్టం చేశారు. గడచిన పదేళ్లుగా దేశం నలుమూలలా ఏర్పాటు చేసిన కొత్త ఐఐటీలు, ఐఐఎంలతో పాటు ఏఐఐఎంఎస్‌ల సంఖ్య, స్వాతంత్ర్యం అనంతరం 60 సంవత్సరాల్లో నెలకొల్పిన మొత్తం విద్యాసంస్థల సంఖ్యను దాటిపోయిందని శ్రీ మోదీ వివరించారు. ఫలితంగా పేదలకూ, ప్రయోజనాలను అందుకోలేకపోయిన వర్గాలకూ ఉన్నత విద్య లో కొత్త కొత్త అవకాశాలు అందివస్తున్నాయన్నారు. గత పది సంవత్సరాల్లో గిరిజన ప్రాంతాల్లో 400 కన్నా ఎక్కువ ‘ఏకలవ్య ఆశ్రమ పాఠశాలల’ను ప్రారంభించినట్లు ప్రధానమంత్రి తెలిపారు. తరాల తరబడి చదువుకోలేకపోయిన ఆదివాసీలకు చెందిన బాల బాలికలు ఇప్పుడు అభివృద్ధి పథంలో ఉన్నారని ఆయన అన్నారు. విద్యకూ, నైపుణ్యాలు-అవకాశాలకూ మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందని కూడా తెలిపారు. ‘స్కిల్ ఇండియా’ వంటి కార్యక్రమాలు యువతీయువకులకు తమ సొంత కాళ్ల మీద నిలబడే సాధికారతను అందిస్తున్నాయన్నారు. పారిశ్రామికంగా దేశం సాధించిన ప్రగతిని శ్రీ మోదీ వివరిస్తూ, ప్రయివేటు రంగంలో ప్రధాన సంస్కరణలూ, ‘ముద్రా యోజన’, ‘స్టాండ్-అప్ ఇండియా’ వంటి పథకాలూ దళితులకు, వెనుకబడిని వర్గాల వారితో పాటు గిరిజనులకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తున్నాయని శ్రీ మోదీ వివరించారు.‘‘ఒక బలమైన, శక్తిమంతమైన భారత్‌ను శ్రీ నారాయణ గురు దర్శించారు. మరి ఈ దృష్టికోణాన్ని సాకారం చేయడానికి భారత్ ఆర్థిక, సామాజిక, సైన్య రంగాలన్నింటా అగ్రగామిగా నిలిచి తీరాలి’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ మార్గం గుండా దేశం స్థిరంగా పయనిస్తోందనీ, ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే దిశలో శరవేగంగా దూసుకుపోతోందనీ ఆయన తెలిపారు. ప్రపంచం ఇటీవల భారత్ సత్తా ఎంతటిదో గమనించిందని శ్రీ మోదీ అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ దృఢమైన, అసలంతమాత్రం రాజీ పడని విధానాన్ని అనుసరిస్తోందని ‘ఆపరేషన్ సిందూర్’ ప్రపంచానికి స్పష్టం చేసిందన్నారు. భారతీయ పౌరుల రక్తాన్ని చిందించే ఉగ్రవాదులు తలదాచుకోవడానికిక ఏ ఆశ్రయం సురక్షితం కానే కాదని భారత్ రుజువు చేసిందని ఆయన అన్నారు. ‘‘జాతి హితానికి ఏది సరైందన్న ఒకే ఒక ప్రాతిపదికన నేటి భారత్ నిర్ణయాలను తీసుకొంటోంది’’ అని శ్రీ మోదీ తెలిపారు. సైన్యం అవసరాల కోసం విదేశాలపై మన దేశం ఆధారపడటం అంతకంతకూ తగ్గుతోందని ఆయన స్పష్టం చేశారు. రక్షణ రంగంలో ఇండియా స్వయంసమృద్ధంగా ఎదుగుతోందని ప్రధానంగా ప్రస్తావించారు. ఈ మార్పు ‘ఆపరేషన్ సిందూర్’ వేళ స్పష్టంగా నిరూపణ అయిందని, ‘ఆపరేషన్ సిందూర్’లో భారత దళాలు దేశీయంగా తయారైన ఆయుధాలను ఉపయోగించి 22 నిమిషాల వ్యవధిలోనే… లొంగిపోక తప్పని స్థితిని శత్రువుకు కల్పించాయని ప్రధానమంత్రి చెప్పారు. రాబోయే కాలంలో, భారత్‌లో తయారు చేసిన ఆయుధాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును పొంది, ప్రశంసలను దక్కించుకొంటాయన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.దేశ ఆకాంక్షలను నెరవేర్చాలంటే శ్రీ నారాయణ గురు బోధనలను పౌరులందరి చెంతకు తీసుకుపోవడం అత్యవసరమని ప్రధానమంత్రి స్పష్టం చేస్తూ, ప్రభుత్వం ఈ దిశగా చురుకుగా పనిచేస్తోందని తెలిపారు. శ్రీ నారాయణ గురు జీవనంతో ముడి పడిన తీర్థయాత్రా స్థలాలను అనుసంధానించడానికి ‘శివగిరి సర్క్యూట్’ను అభివృద్ధిపరిచే పనులు వేగంగా సాగుతున్నాయని ఆయన గుర్తు చేశారు. ‘అమృత్ కాల్’ ద్వారా దేశం సాగిస్తున్న ప్రయాణానికి శ్రీ నారాయణ గురు ఆశీర్వాదాలు, ప్రబోధాలు మార్గదర్శకత్వం వహిస్తూనే ఉంటాయన్న విశ్వాసాన్ని శ్రీ మోదీ వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందిన దేశం కలను భారతదేశ ప్రజలంతా కలిసికట్టుగా నెరవేరుస్తారని రూఢిగా చెప్పారు. శ్రీ నారాయణ గురు ఆశీస్సులు ప్రతి ఒక్కరికీ లభించాలని కోరుకుంటూ, శివగిరి మఠం సాధువులందరి పట్ల తన భక్తిశ్రద్ధలను మరోసారి వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి ప్రసంగాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ వ్యవహారాలు, మత్స్య పరిశ్రమ, పశు సంవర్ధకం, పాడి పరిశ్రమ శాఖ సహాయ మంత్రి శ్రీ జార్జ్ కురియన్, శ్రీ నారాయణ ధర్మ సంఘం ట్రస్టుకు చెందిన సాధువులతో పాటు ఇతర ప్రముఖులు కూడా పాల్గొన్నారు.నేపథ్యంమన దేశంలో ఆధ్యాత్మికంగా, నైతికంగా మహానాయకులైన శ్రీ నారాయణ గురు, మహాత్మా గాంధీల మధ్య 1925 మార్చి నెల 12న శివగిరి మఠంలో చరిత్రాత్మక సంభాషణ చోటు చేసుకొంది. ఆ మఠాన్ని మహాత్మాగాంధీ అప్పట్లో సందర్శించారు. వారిద్దరి మధ్యా జరిగిన సంభాషణలో వైకొం సత్యాగ్రహం, మత మార్పిళ్లు, అహింస, అంటరానితనం నిర్మూలన, మోక్ష సాధన, అణగారిన వర్గాల వారి అభ్యున్నతి తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.శ్రీ నారాయణ ధర్మ సంఘం ట్రస్టు ఏర్పాటు చేసిన ఈ వేడుక ఆధ్యాత్మిక నేతలను, ఇతర సభ్యులను ఒక చోటుకు చేర్చింది. వారు భారత సామాజిక, నైతిక స్వరూపానికి ఇప్పటికీ ఇంకా తాజాగా రూపురేఖలను తీర్చిదిద్దుతూ వస్తున్న దార్శనికతను గుర్తుచేసుకొని తమ ఆలోచనలను వెల్లడించడానికి ఈ వేడుకను నిర్వహించారు. ఇది శ్రీ నారాయణ గురు, మహాత్మాగాంధీ.. వీరు ఇరువురూ సమర్ధించిన సామాజిక న్యాయం, ఏకత, ఆధ్యాత్మిక సామరస్యాలు అలరారే దృష్టికోణానికి ఒక శక్తిమంతమైన నివాళిగా నిలుస్తోంది.**
మహిళల సాధికారతకు ప్రాధాన్యాన్ని ఇవ్వాలని శ్రీ నారాయణ గురు పదే పదే స్పష్టంచేస్తూ వచ్చారనీ, ‘మహిళల నాయకత్వంలో అభివృద్ధిని సాధించాలి’ అనే మంత్రంతో ప్రభుత్వం ముందుకు కదులుతోందనీ ప్రధానమంత్రి తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా, మహిళలకు ప్రవేశం లేని రంగాలు అనేకం ఉన్నాయని ఆయన అన్నారు. ఈ ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసి, మహిళలు కొత్త కొత్త రంగాల్లో అడుగుపెట్టే స్థితిని కల్పించిందని ఆయన చెప్పారు. ఇవాళ… క్రీడలు మొదలు అంతరిక్షం వరకు… ప్రతి రంగంలోనూ మహిళలు దేశాన్ని గర్వపడేటట్లు చేస్తున్నారని శ్రీ మోదీ ప్రధానంగా ప్రస్తావించారు. సంఘంలోని ప్రతి ఒక్క వర్గం, ప్రతి ఒక్క విభాగం ప్రస్తుతం ‘అభివృద్ధి చెందిన భారత్’ కలను నిజం చేయడానికి తన వంతు తోడ్పాటును అందిస్తున్నాయని ప్రధానమంత్రి అన్నారు. ‘స్వచ్ఛ్ భారత్ మిషన్’, పర్యావరణ ప్రధాన ప్రచారోద్యమాలు, ‘అమృత్ సరోవర్’ల నిర్మాణం, చిరు ధాన్యాలపై జాగృతిని పెంచే కార్యక్రమాలను గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఈ ప్రయత్నాలు ప్రజల ఉత్సాహంతో, 140 కోట్ల మంది భారతీయుల అండదండలతో పురోగమిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు.
శ్రీ నారాయణ గురు దృష్టికోణం అజరామరమని శ్రీ మోదీ వెల్లడించారు. ‘‘విద్య ద్వారా జ్ఞానం, కలిసి ఉండటం ద్వారా శక్తిమంతం కావడం, పరిశ్రమ ద్వారా సమృద్ధి’’… ఇదే శ్రీ నారాయణ గురు బోధించిందని ప్రధానమంత్రి అన్నారు. ‘‘శ్రీ నారాయణ గురు ఈ తరహా దార్శనికతను ప్రవచించడం ఒక్కటే కాకుండా, దీనిని సాకారం చేయడానికి వ్యవస్థాగత ఏర్పాట్లు కూడా చేశారు’’ అని శ్రీ మోదీ చెప్పారు. గురూజీ… శారదా మఠాన్ని ఏర్పాటు చేసింది శివగిరిలోనేననీ, దీనిని సరస్వతి దేవికి అంకితం చేశారని తెలిపారు. సమాజంలో ఆదరణకు నోచుకోని వర్గాల విముక్తికీ, వారి అభ్యున్నతికీ విద్య ఒక సాధనంగా తప్పక రూపొందాలనే విశ్వాసానికి ప్రతీకగా ఈ సంస్థ నిలిచిందని ఆయన ఉద్ఘాటించారు. గురుదేవ్ మొదలుపెట్టిన ప్రయత్నాలు ఈ రోజుకు కూడా దేశం నలుమూలలా అనేక నగరాలకు విస్తరిస్తూనే ఉన్నాయనీ, గురుదేవ్ సెంటర్లతో పాటు శ్రీ నారాయణ కల్చరల్ మిషన్ మానవ జాతి సంక్షేమానికి చురుకుగా పనిచేస్తోందనీ చెప్తూ శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.
‘‘విద్య, సంస్థ, పారిశ్రామిక పురోగతి ద్వారా సాంఘిక సంక్షేమ సాధనకు సంబంధించిన దృష్టికోణం దేశం అనుసరిస్తున్న ప్రస్తుత విధానాల్లోనూ, తీసుకొంటున్న నిర్ణయాల్లోనూ స్పష్టంగా ప్రతిబింబిస్తోంది’’ అని ప్రధానమంత్రి అన్నారు. ఎన్నో దశాబ్దాల తరువాత, ఒక కొత్త జాతీయ విద్యావిధానాన్ని అమలు చేశామని ఆయన చెప్పారు. ఈ విధానం విద్యను ఆధునికీకరించడం ఒక్కటే కాకుండా విద్యను మరిన్ని వర్గాల వారి వద్దకు తీసుకు పోతుందనీ, మాతృభాషను నేర్చుకోవడాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. సమాజంలో నిరాదరణకు గురైన వర్గాల వారికి దీనివల్ల లబ్ది చేకూరిందని ఆయన స్ఫష్టం చేశారు. గడచిన పదేళ్లుగా దేశం నలుమూలలా ఏర్పాటు చేసిన కొత్త ఐఐటీలు, ఐఐఎంలతో పాటు ఏఐఐఎంఎస్‌ల సంఖ్య, స్వాతంత్ర్యం అనంతరం 60 సంవత్సరాల్లో నెలకొల్పిన మొత్తం విద్యాసంస్థల సంఖ్యను దాటిపోయిందని శ్రీ మోదీ వివరించారు. ఫలితంగా పేదలకూ, ప్రయోజనాలను అందుకోలేకపోయిన వర్గాలకూ ఉన్నత విద్య లో కొత్త కొత్త అవకాశాలు అందివస్తున్నాయన్నారు. గత పది సంవత్సరాల్లో గిరిజన ప్రాంతాల్లో 400 కన్నా ఎక్కువ ‘ఏకలవ్య ఆశ్రమ పాఠశాలల’ను ప్రారంభించినట్లు ప్రధానమంత్రి తెలిపారు. తరాల తరబడి చదువుకోలేకపోయిన ఆదివాసీలకు చెందిన బాల బాలికలు ఇప్పుడు అభివృద్ధి పథంలో ఉన్నారని ఆయన అన్నారు. విద్యకూ, నైపుణ్యాలు–అవకాశాలకూ మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందని కూడా తెలిపారు. ‘స్కిల్ ఇండియా’ వంటి కార్యక్రమాలు యువతీయువకులకు తమ సొంత కాళ్ల మీద నిలబడే సాధికారతను అందిస్తున్నాయన్నారు. పారిశ్రామికంగా దేశం సాధించిన ప్రగతిని శ్రీ మోదీ వివరిస్తూ, ప్రయివేటు రంగంలో ప్రధాన సంస్కరణలూ, ‘ముద్రా యోజన’, ‘స్టాండ్–అప్ ఇండియా’ వంటి పథకాలూ దళితులకు, వెనుకబడిని వర్గాల వారితో పాటు గిరిజనులకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తున్నాయని శ్రీ మోదీ వివరించారు.
‘‘ఒక బలమైన, శక్తిమంతమైన భారత్‌ను శ్రీ నారాయణ గురు దర్శించారు. మరి ఈ దృష్టికోణాన్ని సాకారం చేయడానికి భారత్ ఆర్థిక, సామాజిక, సైన్య రంగాలన్నింటా అగ్రగామిగా నిలిచి తీరాలి’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ మార్గం గుండా దేశం స్థిరంగా పయనిస్తోందనీ, ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే దిశలో శరవేగంగా దూసుకుపోతోందనీ ఆయన తెలిపారు. ప్రపంచం ఇటీవల భారత్ సత్తా ఎంతటిదో గమనించిందని శ్రీ మోదీ అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ దృఢమైన, అసలంతమాత్రం రాజీ పడని విధానాన్ని అనుసరిస్తోందని ‘ఆపరేషన్ సిందూర్’ ప్రపంచానికి స్పష్టం చేసిందన్నారు. భారతీయ పౌరుల రక్తాన్ని చిందించే ఉగ్రవాదులు తలదాచుకోవడానికిక ఏ ఆశ్రయం సురక్షితం కానే కాదని భారత్ రుజువు చేసిందని ఆయన అన్నారు.
‘‘జాతి హితానికి ఏది సరైందన్న ఒకే ఒక ప్రాతిపదికన నేటి భారత్ నిర్ణయాలను తీసుకొంటోంది’’ అని శ్రీ మోదీ తెలిపారు. సైన్యం అవసరాల కోసం విదేశాలపై మన దేశం ఆధారపడటం అంతకంతకూ తగ్గుతోందని ఆయన స్పష్టం చేశారు. రక్షణ రంగంలో ఇండియా స్వయంసమృద్ధంగా ఎదుగుతోందని ప్రధానంగా ప్రస్తావించారు. ఈ మార్పు ‘ఆపరేషన్ సిందూర్’ వేళ స్పష్టంగా నిరూపణ అయిందని, ‘ఆపరేషన్ సిందూర్’లో భారత దళాలు దేశీయంగా తయారైన ఆయుధాలను ఉపయోగించి 22 నిమిషాల వ్యవధిలోనే… లొంగిపోక తప్పని స్థితిని శత్రువుకు కల్పించాయని ప్రధానమంత్రి చెప్పారు. రాబోయే కాలంలో, భారత్‌లో తయారు చేసిన ఆయుధాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును పొంది, ప్రశంసలను దక్కించుకొంటాయన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
దేశ ఆకాంక్షలను నెరవేర్చాలంటే శ్రీ నారాయణ గురు బోధనలను పౌరులందరి చెంతకు తీసుకుపోవడం అత్యవసరమని ప్రధానమంత్రి స్పష్టం చేస్తూ, ప్రభుత్వం ఈ దిశగా చురుకుగా పనిచేస్తోందని తెలిపారు. శ్రీ నారాయణ గురు జీవనంతో ముడి పడిన తీర్థయాత్రా స్థలాలను అనుసంధానించడానికి ‘శివగిరి సర్క్యూట్’ను అభివృద్ధిపరిచే పనులు వేగంగా సాగుతున్నాయని ఆయన గుర్తు చేశారు. ‘అమృత్ కాల్’ ద్వారా దేశం సాగిస్తున్న ప్రయాణానికి శ్రీ నారాయణ గురు ఆశీర్వాదాలు, ప్రబోధాలు మార్గదర్శకత్వం వహిస్తూనే ఉంటాయన్న విశ్వాసాన్ని శ్రీ మోదీ వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందిన దేశం కలను భారతదేశ ప్రజలంతా కలిసికట్టుగా నెరవేరుస్తారని రూఢిగా చెప్పారు. శ్రీ నారాయణ గురు ఆశీస్సులు ప్రతి ఒక్కరికీ లభించాలని కోరుకుంటూ, శివగిరి మఠం సాధువులందరి పట్ల తన భక్తిశ్రద్ధలను మరోసారి వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి ప్రసంగాన్ని ముగించారు.
ఈ కార్యక్రమంలో మైనారిటీ వ్యవహారాలు, మత్స్య పరిశ్రమ, పశు సంవర్ధకం, పాడి పరిశ్రమ శాఖ సహాయ మంత్రి శ్రీ జార్జ్ కురియన్, శ్రీ నారాయణ ధర్మ సంఘం ట్రస్టుకు చెందిన సాధువులతో పాటు ఇతర ప్రముఖులు కూడా పాల్గొన్నారు.
నేపథ్యం
మన దేశంలో ఆధ్యాత్మికంగా, నైతికంగా మహానాయకులైన శ్రీ నారాయణ గురు, మహాత్మా గాంధీల మధ్య 1925 మార్చి నెల 12న శివగిరి మఠంలో చరిత్రాత్మక సంభాషణ చోటు చేసుకొంది. ఆ మఠాన్ని మహాత్మాగాంధీ అప్పట్లో సందర్శించారు. వారిద్దరి మధ్యా జరిగిన సంభాషణలో వైకొం సత్యాగ్రహం, మత మార్పిళ్లు, అహింస, అంటరానితనం నిర్మూలన, మోక్ష సాధన, అణగారిన వర్గాల వారి అభ్యున్నతి తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.
శ్రీ నారాయణ ధర్మ సంఘం ట్రస్టు ఏర్పాటు చేసిన ఈ వేడుక ఆధ్యాత్మిక నేతలను, ఇతర సభ్యులను ఒక చోటుకు చేర్చింది. వారు భారత సామాజిక, నైతిక స్వరూపానికి ఇప్పటికీ ఇంకా తాజాగా రూపురేఖలను తీర్చిదిద్దుతూ వస్తున్న దార్శనికతను గుర్తుచేసుకొని తమ ఆలోచనలను వెల్లడించడానికి ఈ వేడుకను నిర్వహించారు. ఇది శ్రీ నారాయణ గురు, మహాత్మాగాంధీ.. వీరు ఇరువురూ సమర్ధించిన సామాజిక న్యాయం, ఏకత, ఆధ్యాత్మిక సామరస్యాలు అలరారే దృష్టికోణానికి ఒక శక్తిమంతమైన నివాళిగా నిలుస్తోంది.
The contributions of Sree Narayana Guru and Mahatma Gandhi are exemplary. Addressing a programme marking the centenary celebration of the conversation between the two greats. https://t.co/Kz8JK0Axdn
— Narendra Modi (@narendramodi) June 24, 2025
The ideals of Sree Narayana Guru are a great treasure for all of humanity. pic.twitter.com/YmgAsjwVRA
— PMO India (@PMOIndia) June 24, 2025
India has been blessed with remarkable saints, sages and social reformers who have brought about transformative changes in society. pic.twitter.com/j9ZL7D6vJw
— PMO India (@PMOIndia) June 24, 2025
Sree Narayana Guru envisioned a society free from all forms of discrimination.
— PMO India (@PMOIndia) June 24, 2025
Today, by adopting the saturation approach, the country is working to eliminate every possibility of discrimination. pic.twitter.com/L4Z5ywIe69
Missions like Skill India are empowering the youth and making them self-reliant. pic.twitter.com/d1eu9IpP5d
— PMO India (@PMOIndia) June 24, 2025
To empower India, we must lead on every front - economic, social and military. Today, the nation is moving forward on this very path. pic.twitter.com/1zQFJK9CcA
— PMO India (@PMOIndia) June 24, 2025
श्री नारायण गुरु के आदर्श पूरी मानवता के लिए बहुत बड़ी पूंजी हैं। इसलिए मैं जब समाज के शोषित-वंचित वर्ग के लिए बड़े निर्णय लेता हूं, तो गुरुदेव को जरूर याद करता हूं। pic.twitter.com/pF94sxSgbc
— Narendra Modi (@narendramodi) June 24, 2025
श्री नारायण गुरु ने अध्यात्म को समाज-सुधार और समाज-कल्याण का माध्यम बनाया। उनके प्रयासों से ना सिर्फ पूज्य बापू ने प्रेरणा पाई, बल्कि इसका लाभ गुरुदेव रवीन्द्रनाथ टैगोर जैसे विद्वानों को भी मिला। pic.twitter.com/4D2P3L25RT
— Narendra Modi (@narendramodi) June 24, 2025
हमने सेवा को संकल्प बनाया, जिसका परिणाम है कि आज देशभर के करोड़ों परिवारों को पीएम आवास से लेकर बिजली, पानी और शौचालय जैसी सुविधाओं का लाभ मिल रहा है। pic.twitter.com/ntsKSMhwLI
— Narendra Modi (@narendramodi) June 24, 2025
शिक्षा, संगठन और औद्योगिक प्रगति से समाज कल्याण के विजन की स्पष्ट छाप आज हम देश की नीतियों और निर्णयों में भी देख सकते हैं। इससे देश के युवाओं के लिए अवसरों के नए द्वार खुल रहे हैं। pic.twitter.com/FznOnKcff6
— Narendra Modi (@narendramodi) June 24, 2025
भारत के सशक्तिकरण के लिए हमें आर्थिक, सामाजिक और सैन्य, हर पहलू में आगे रहना है। डिफेंस सेक्टर में आत्मनिर्भरता का प्रभाव हमने ऑपरेशन सिंदूर के दौरान भी देखा है। pic.twitter.com/PE5uuYiRsu
— Narendra Modi (@narendramodi) June 24, 2025