Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతదేశం, రష్యా ల 22వ వార్షికశిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి మాస్కో కు చేరుకొన్న ప్రధాన మంత్రి

భారతదేశం, రష్యా ల 22వ వార్షికశిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి మాస్కో కు చేరుకొన్న ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున ఆధికారిక పర్యటన నిమిత్తం మాస్కో కు చేరుకొన్నారు. వనుకోవో-II విమానాశ్రయానికి ప్రధాన మంత్రి చేరుకోవడంతోనే రష్యన్ ఫెడరేషన్ ప్రథమ ఉప ప్రధాని శ్రీ డెనిస్ మంటురోవ్ ఆయన కు స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ప్రధాన మంత్రికి సంప్రదాయబద్ధ స్వాగతం లభించింది.

ప్రధాన మంత్రి తన పర్యటనలో, అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ తో కలసి భారతదేశం, రష్యా ల 22వ వార్షిక శిఖరాగ్ర సమావేశానికి సహాధ్యక్షత వహించనున్నారు. ఆయన మాస్కోలో భారతీయ సముదాయం సభ్యులతో కూడా మాట్లాడనున్నారు.

***