Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రజత పతకాన్ని గెలుచుకున్న శ్రీ యోగేశ్ కథూనియా కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు


ఫ్రాన్స్ లో ప్రస్తుతం జరుగుతున్న పారాలింపిక్స్ లో పురుషుల డిస్కస్ త్రో ఎఫ్56 పోటీలో రజత పతకాన్ని గెలిచినందుకు క్రీడాకారుడు శ్రీ యోగేశ్ కథూనియా ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు అభినందించారు.

శ్రీ కథూనియా చాటిన దృఢసంకల్పాన్ని, కఠోర శ్రమను, ధీరత్వాన్ని శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో ఒక సందేశంలో ఈ కింది విధంగా పేర్కొన్నారు:

‘‘పారాలింపిక్స్ 2024 (#Paralympics2024) లో భాగంగా నిర్వహించిన పురుషుల డిస్కస్ త్రో ఎఫ్56 పోటీలో రజత పతకాన్ని గెలుచుకొని భారతదేశానికి గర్వకారణంగా నిలి చినందుకు శ్రీ యోగేశ్ కథూనియా (@YogeshKathuniya) కు ఇవే అభినందనలు.  ఆయనది దృఢ సంకల్పం, కఠోర శ్రమ, ధీరత్వాలు కలబోసిన ఓ ఆశ్చర్యకర ప్రయాణం. రానున్న కాలంలో సైతం ఆయన యత్నాలు సత్ఫలితాలను ఇవ్వాలని నేను కోరుకొంటున్నాను.

చీర్ ఫర్ భారత్ #Cheer4Bharat.’

 

 

***

MJPS/RT