పిఎంఇండియా
ఇంటి కప్పు పైన సౌర ఫలకాన్ని ఏర్పాటు చేసే మరియు ఒక కోటి కుటుంబాల కు ప్రతి నెలా 300 యూనిట్ ల వరకు విద్యుచ్ఛక్తి ని ఉచితం గా అందజేసేందుకు ఉద్దేశించిన ‘‘పిఎమ్-సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన’’ ను మొత్తం 75,021 కోట్ల రూపాయల వ్యయండి తో అమలు చేయడాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదాన్ని తెలిపింది. ఈ పథకాన్ని 2024 ఫిబ్రవరి 13 వ తేదీ నాడు ప్రధాన మంత్రి ప్రారంభించారు.
ఈ పథకం లో ముఖ్యాంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
నివాస భవనాల పైకప్పు మీద సౌర శక్తి ఉత్పాదన కై కేంద్రీయ ఆర్థిక సహాయం (సిఎఫ్ఎ)
ఈ పథకం లోని ఇతర ముఖ్యాంశాలు
1. గ్రామీణ ప్రాంతాల లో ఇంటి పైకప్పు మీద సౌర వ్యవస్థ ను అమర్చడాని కి ఇది ఒక నమూనాగా ఉంటుంది. దేశం లోని ప్రతి ఒక్క జిల్లా లో ఒక ఆదర్శ సౌర గ్రామాన్ని అభివృద్ధి పరచడం జరుగుతుంది,
2. పట్టణ స్థానిక సంస్థలు మరియు పంచాయతీ రాజ్ సంస్థలు వాటి వాటి నిర్ణయాధికార పరిధుల లో రూఫ్ టాప్ సోలర్ వ్యవస్థ (ఆర్ టిఎస్) ల స్థాపన ను ప్రోత్సహించడం కోసం అందజేసే ప్రోత్సాహకాలతో ప్రయోజనాలను పొందగలవు.
3. ఈ పథకం కంపోనంట్ ఫార్ పేమెంట్ సెక్యూరిటీ ఫార్ రీన్యూవబుల్ ఎనర్జీ సర్వీస్ కంపెనీ (ఆర్ఇఎస్సిఒ) ఆధారితమైన నమూనాల తో పాటు రూఫ్ టాప్ సోలర్ సిస్టమ్ (ఆర్ టిఎస్) లో వినూత్నమైన ప్రాజెక్టుల కోసం ఉద్దేశించిన ఒక నిధి ని సైతం అందిస్తుంది.
ఫలితం మరియు ప్రభావం
ఈ పథకం ద్వారా, దీనిలో చేరే కుటుంబాలు విద్యుత్తు బిల్లు ను ఆదా చేసుకోవడంతో పాటు మిగులు విద్యుత్తు ను డిస్కామ్ లకు అమ్మడం ద్వారా అదనపు ఆదాయాన్ని కూడా ను సంపాదించుఃకో గలుగుతాయి. 3 కిలోవాట్ సామర్థ్యం కలిగి ఉండే ఒక వ్యవస్థ ఒక కుటుంబం సగటు న ఒక నెల లో 300 కు మించిన యూనిట్ ల విద్యుత్తు ను ఉత్పత్తి చేయ గలుగుతుంది.
ప్రతిపాదిత పథకం ఫలితం గా నివాస భవనాల రంగం లో ఇంటి పైకప్పు మీద అమర్చిన సౌర శక్తి మాధ్యం ద్వారా30 గీగావాట్ సౌర సామర్థ్యం పెరుగుతుంది. దీనితో 1000 బియు ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది; అంతేకాక, ఇంటి పైకప్పు మీద అమర్చిన వ్యవస్థ యొక్క 25 సంవత్సరాల జీవన కాలం లో ఉద్గారాల లో 720 మిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ కు సమానమైన తగ్గింపు సాధ్య పడుతుంది.
ఈ పథకం తయారీ, లాజిస్టిక్స్, సప్లయ్ చైన్, విక్రయాలు, స్థాపన, ఒ ఎండ్ ఎమ్ ఇంకా ఇతర సేవల లో సుమారు గా 17 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాల కు ఆస్కారాన్ని కల్పిస్తుందన్న అంచనా ఉంది.
పిఎమ్-సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన యొక్క లాభాల ను అందుకోవడానికి
ప్రభుత్వం ఈ పథకాన్ని ఆరంభించిన తరువాతి నుండి దీనిని గురించిన అవగాహన ను పెంచడం మరియు ఆసక్తి ఉన్న కుటుంబాల నుండి దరఖాస్తుల ను స్వీకరించడం కోసం పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఈ పథకం లో ప్రయోజనాల ను అందుకోవడం కోసం ఆసక్తి కలిగిన కుటుంబాలు https://pmsuryaghar.gov.in/ లో పేరులను నమోదు చేసుకోవచ్చు.
***
PM-Surya Ghar: Muft Bijli Yojana, which has been approved by the Cabinet, is going to be a game changer for bringing sustainable energy solutions to every home. Harnessing solar power, this initiative promises to light up lives without burdening pockets, ensuring a brighter,… https://t.co/kSj0E40Ehf
— Narendra Modi (@narendramodi) February 29, 2024