Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడిన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ… 73వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు


భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు గౌరవనీయులు వ్లాదిమిర్ పుతిన్‌తో ఈ రోజు టెలిఫోన్‌లో సంభాషించారు.

పుతిన్ 73వ పుట్టినరోజు సందర్భంగా శ్రీ మోదీ ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆరోగ్యంగా ఉండాలని, ఆయన ప్రయత్నాలన్నీ విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

ద్వైపాక్షిక ఎజెండాలో పురోగతిపై వారిద్దరూ సమీక్షించారు. భారత్ – రష్యా మధ్య ప్రత్యేక, విశిష్ట వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు.

భారత్-రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సదస్సు కోసం భారత్ రావాల్సిందిగా గౌరవ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను శ్రీ మోదీ ఆహ్వానించారు.