Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అధికారిక పర్యటన నిమిత్తం తొలిసారి భారత్‌కు వచ్చిన యూకే ప్రధాని కీర్ స్టార్మర్‌కు స్వాగతం పలికిన ప్రధానమంత్రి


యునైటెడ్ కింగ్డమ్ నుంచి అతి పెద్ద వాణిజ్య బృందంతో కలసి చరిత్రాత్మక పర్యటన నిమిత్తం తొలిసారిగా భారత్‌కు విచ్చేసిన ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆత్మీయ స్వాగతం పలికారు.

భారత్, యునైటెడ్ కింగ్డమ్ మధ్య బలమైనపరస్పర ప్రయోజనకరమైన భవిష్యత్తు అనే ఉమ్మడి లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా రేపు జరగబోయే సమావేశం కోసం ఎదురు చూస్తున్నట్లు ప్రధాన మంత్రి శ్రీ మోదీ తెలిపారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

యూకే నుంచి అతి పెద్ద వాణిజ్య బృందంతో కలసి చరిత్రాత్మక పర్యటన నిమిత్తం తొలిసారిగా భారత పర్యటనకు వచ్చిన ప్రధాని కీర్ స్టార్మర్‌కు స్వాగతందృఢమైనపరస్పర ప్రయోజనకరమైన భవిష్యత్తు అనే మన ఉమ్మడి లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా రేపు జరగబోయే సమావేశం కోసం ఎదురు చూస్తున్నాను”.