పిఎంఇండియా
గౌరవ భూటాన్ నాలుగో రాజు జిగ్మే సింగే వాంగ్చుక్ 70వ జయంతి సందర్భంగా థింపూలోని చాంగ్లిమిథాంగ్ స్టేడియంలో ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో.. భూటాన్ రాజు, రాజకుటుంబం, భూటాన్ ప్రభుత్వం, ప్రజలతో కలిసి భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఢిల్లీ పేలుడు ఘటనలో బాధితులకు సానుభూతి తెలుపుతూ భూటాన్ రాజు నేతృత్వంలో ఈ సందర్భంగా సామూహిక ప్రార్థన చేశారు.
సభనుద్దేశించి ప్రసంగించిన శ్రీ నరేంద్ర మోదీ.. గౌరవ నాలుగో రాజుకు, భూటాన్ ప్రజలకు భారతీయుల తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆయన పాలన కాలంలోనే ఆధునిక జాతీయ ప్రభుత్వంగా, రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య రాజ్యంగా భూటాన్ అవతరించిందని కొనియాడారు. ఆర్థిక వృద్ధిని, సుస్థిరతను మేళవించే ‘స్థూల జాతీయానందం’ అనే విశిష్ట భావన నాలుగో రాజు నేతృత్వంలోనే భూటాన్లో మొదలైందన్నారు.
భారత్, భూటాన్ ప్రత్యేక మైత్రి కోసం అమూల్య కృషి చేసిన గౌరవ భూటాన్ నాలుగో రాజుకు భారత ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని రంగాల్లో భారత్ – భూటాన్ భాగస్వామ్యాన్ని వ్యక్తిగత శ్రద్ధతో కొన్నేళ్లుగా ఆయన తీర్చిదిద్దారన్నారు. మహారాజు మార్గనిర్దేశం, ఉపయోగకరమైన సూచనలతో ఈ సంబంధం ఇరుపక్షాలకూ లాభదాయకంగా కొనసాగుతుందని భారత ప్రధానమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
గౌరవ భూటాన్ రాజు తన దార్శనికత, నిరంతర కృషితో.. గౌరవ నాలుగో రాజు విశిష్ట వారసత్వాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని భారత ప్రధానమంత్రి ప్రశంసించారు. మహారాజు నేతృత్వంలో భూటాన్ అద్భుత పురోగతి సాధించిందని.. అలాగే భారత్ – భూటాన్ మధ్య శాశ్వత స్నేహం, సన్నిహిత భాగస్వామ్యం నెలకొన్నాయని ఆయన స్పష్టం చేశారు. ప్రధానమంత్రి పూర్తి ప్రసంగాన్ని ఇక్కడ చూడొచ్చు (లింకు)
***
Speaking in Thimphu, Bhutan. Watch. https://t.co/nLu0f5q5WY
— Narendra Modi (@narendramodi) November 11, 2025
The horrific blast in Delhi last evening has deeply pained everyone. India stands with those who have suffered.
— Narendra Modi (@narendramodi) November 11, 2025
I assure everyone that the agencies will get to the bottom of the entire conspiracy.
All those involved will be brought to justice. pic.twitter.com/gwFzSVwD2Q
कल शाम दिल्ली में हुई भयावह घटना ने सभी के मन को व्यथित किया है। मैं पीड़ित परिवारों का दुख समझता हूं। पूरा देश उनके साथ खड़ा है।
— Narendra Modi (@narendramodi) November 11, 2025
मैं हर किसी को आश्वस्त करता हूं कि हमारी जांच एजेंसियां इस षड्यंत्र की तह तक जाएंगी। जो भी लोग इसके लिए जिम्मेदार हैं, उन्हें किसी भी कीमत पर नहीं… pic.twitter.com/RnjaEbLuzA
His Majesty the Fourth King is admired as a father figure in Bhutan. His vision has ensured Bhutan scales new heights of progress. pic.twitter.com/qhpWkTzV3M
— Narendra Modi (@narendramodi) November 11, 2025
India and Bhutan have a deep rooted connect, seen in the diverse cooperation between our nations. pic.twitter.com/A1agMw4DhM
— Narendra Modi (@narendramodi) November 11, 2025
Energy and connectivity are two areas where India-Bhutan cooperation is deepening. pic.twitter.com/Nom6uV1Kt6
— Narendra Modi (@narendramodi) November 11, 2025