Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మదీనాలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన భారతీయులకు ప్రధాని సంతాపం


సౌదీ అరేబియాలోనిమదీనాలో జరిగిన ప్రమాదంలో భారతీయులు మరణించడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారుతమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి తెలిపారుగాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

 

రియాద్‌లోని భారతీయ ఎంబసీజెడ్డాలోని కాన్సులేట్ బాధితులకు అన్ని విధాలుగా సాధ్యమైనంత సాయాన్ని అందిస్తున్నాయని ప్రధానమంత్రి అన్నారుఅవసరమైన సాయాన్నిసహకారాన్ని అందించడానికి సౌదీ అరేబియా అధికారులతో భారత అధికారులు సంప్రదిస్తున్నారని తెలిపారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి చేసిన పోస్టు:

‘‘మదీనాలో జరిగిన ప్రమాదంలో భారతీయులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరంతమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నానుగాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానురియాద్‌లో ఉన్న మన ఎంబసీజెడ్డాలో ఉన్న కాన్సులేట్ అన్ని విధాలుగా సాధ్యమైనంత సాయాన్ని అందిస్తున్నాయిసౌదీ అరేబియన్ అధికారులతో మన అధికారులు మాట్లాడుతున్నారు’’

 

***