పిఎంఇండియా
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్య కాంత్ ఈ రోజున పదవీ ప్రమాణాన్ని స్వీకరించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
శ్రీ మోదీ ఒక సందేశాన్ని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పొందుపరుస్తూ –
‘‘భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్య కాంత్ పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి నేను హాజరయ్యాను. ఆయన పదవీకాలం ఫలప్రదం కావాలని కోరుకుంటున్నాను…ఆయనకు ఇవే శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు.
***
Attended the oath taking ceremony of Justice Surya Kant as the Chief Justice of India. Best wishes to him for his tenure ahead. pic.twitter.com/62yeSlfmsx
— Narendra Modi (@narendramodi) November 24, 2025