Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇండియా ఎనర్జీ వీక్ 2026 ప్రారంభ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇండియా ఎనర్జీ వీక్ 2026 ప్రారంభ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ


ఇండియా ఎనర్జీ వీక్ 2026 ప్రారంభ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారుగోవాలో జరుగుతున్న ఎనర్జీ వీక్ కొత్త సంచికలో దాదాపు 125 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటున్నారని వెల్లడించారుఇంధన భద్రతసుస్థిర భవిష్యత్తు గురించి చర్చించేందుకు వారు భారత్‌కు వచ్చారని చెబుతూ.. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారందరికీ స్వాగతం పలికారు.

అతి తక్కువ సమయంలో.. అంతర్జాతీయ చర్చకార్యాచరణ వేదికగా ఇండియా ఎనర్జీ వీక్ మారిందని ప్రధానమంత్రి తెలియజేశారుఇంధన రంగంలో భారత్‌లో విస్తృత అవకాశాలున్నాయని ప్రధానమంత్రి చెప్పారుప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్ అనిఅంటే.. దేశంలో ఇంధన ఉత్పత్తులకు గిరాకీ నిరంతరం పెరుగుతోందని దీని అర్థమని వివరించారుఅంతర్జాతీయ డిమాండ్‌ను తీర్చేందుకు భారత్‌లో గొప్ప అవకాశాలున్నాయని ఆయన స్పష్టం చేశారుదాదాపు 150కి పైగా దేశాలకు ఎగుమతులు చేస్తూ.. ప్రపంచంలోనే పెట్రోలియం ఉత్పత్తుల్లో అయిదు అగ్ర ఎగుమతిదారుల్లో భారత్ ఒకటిగా నిలిచిందని శ్రీ మోదీ చెప్పారుభారత్‌కున్న ఈ సామర్థ్యం అందరికీ లబ్ధి చేకూరుస్తుందని తెలిపారుభాగస్వామ్యాలను అన్వేషించడానికి ఎనర్జీ వీక్ మంచి వేదిక అని పేర్కొంటూ.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

 

***