Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అధ్యక్షుడు ట్రంప్‌తో మాట్లాడిన ప్రధానమంత్రి


అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మాట్లాడారుభారత ఉత్పత్తులపై సుంకాలను 18 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించిన అధ్యక్షుడు ట్రంప్‌నకు 1.4 బిలియన్ల మంది భారతీయుల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు.

రెండు అతి ప్రధాన ఆర్థిక వ్యవస్థలుప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలు కలసి పని చేసినప్పుడు.. అది మన ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందనిఉభయ పక్షాలకు లబ్ధినందించే సహకారానికి అపారమైన అవకాశాలను ఇస్తుందని శ్రీ మోదీ తెలిపారు.

‘‘ప్రపంచ శాంతిస్థిరత్వంసంక్షేమానికి అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వం కీలకమైనదిఆయన చేస్తున్న శాంతి ప్రయత్నాలకు భారత్ సంపూర్ణ మద్దతు ఇస్తుంది’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ పోస్టు:

‘‘నా మిత్రుడుఅధ్యక్షుడు ట్రంప్‌తో ఈ రోజు మాట్లాడటం చాలా ఆనందంగా ఉందిభారత్‌లో తయారైన ఉత్పత్తులపై విధించే సుంకం ఇప్పుడు 18 శాతానికి తగ్గుతున్నందుకు సంతోషిస్తున్నానుఈ అద్భుతమైన ప్రకటన చేసిన అధ్యక్షుడు ట్రంప్‌నకు 1.4 బిలియన్ల మంది భారతీయుల తరఫున కృతజ్ఞతలు.

రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థలుప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలసి పని చేసినప్పుడు అది మన ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందిఉభయ పక్షాలకు లబ్ధిని అందించే సహకారానికి అపారమైన అవకాశాలను ఇస్తుంది.

అంతర్జాతీయ శాంతిస్థిరత్వంసంక్షేమానికి అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వం కీలకంఆయన చేస్తున్న శాంతి ప్రయత్నాలకు భారత్ సంపూర్ణ మద్దతును అందిస్తుంది.

మన భాగస్వామ్యాన్ని నూతన శిఖరాలకు చేర్చేలా.. వారితో కలసి పని చేసేందుకు ఎదురు చూస్తున్నాను.’’

@POTUS 

@realDonaldTrump