Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జపాన్ ప్రతినిధుల సభ ఎన్నికలలో మహత్తర విజయాన్ని సాధించినందుకు సనాయీ తాకాయిచీకి అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి


జపాన్ ప్రతినిధుల సభ ఎన్నికలలో మహత్తర విజయాన్ని సాధించినందుకు సనాయీ తాకాయిచీకి ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
ప్రపంచ శాంతినీస్థిరత్వాన్నీసమృద్ధినీ పెంపొందించడంలో భారత్జపాన్‌ల ప్రత్యేక వ్యూహాత్మకప్రపంచ భాగస్వామ్యం కీలక పాత్రను పోషిస్తుందని ప్రధానమంత్రి అన్నారు.

తాకాయిచీ సమర్థ నాయకత్వంలో భారత్జపాన్ మైత్రి కొత్త శిఖరాలను అందుకుంటుందన్న నమ్మకం తనకు ఉందని ప్రధానమంత్రి అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ 
‘‘
ప్రతినిధుల సభ ఎన్నికలలో మహత్తర విజయాన్ని సాధించిన సనాయీ తాకాయిచీ గారికి ఇవే అభినందనలు.
ప్రపంచ శాంతినీస్థిరత్వాన్నీసమృద్ధినీ పెంపొందించడంలో మన రెండు దేశాల ప్రత్యేక వ్యూహాత్మకప్రపంచ భాగస్వామ్యం కీలక పాత్రను పోషిస్తోంది.

మీ సమర్థ నాయకత్వంలోభారత్జపాన్ మైత్రిని కొత్త శిఖరాలకు చేర్చడాన్ని మనం ఇకముందూ కొనసాగిస్తామని నాకు పూర్తి విశ్వాసం ఉందని పేర్కొన్నారు.

 

***