పిఎంఇండియా
రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) అధ్యక్షుడు శ్రీ రబీ లామిఛానే, ఆ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీ బాలేంద్ర షాతో టెలిఫోన్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ మాట్లాడారు.
నేపాల్ ఎన్నికల్లో గెలుపొందిన ఇద్దరు నాయకులకు, ఘన విజయం సాధించిన ఆర్ఎస్పీకి అభినందనలు తెలిపారు. త్వరలో ఏర్పాటయ్యే నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేశారు. రెండు దేశాల పరస్పర సంక్షేమం, పురోగతి, ప్రజల శ్రేయస్సు కోసం కలసి పనిచేయడానికి భారతదేశ నిబద్ధతను పునరుద్ఘాటించారు.
భారత్–నేపాల్ సంబంధాల భవిష్యత్తుపై విశ్వాసాన్ని ప్రధాని వ్యక్తం చేస్తూ.. రానున్న కాలంలో రెండు దేశాల మధ్య భాగస్వామ్యం ఉమ్మడి ప్రయత్నాలతో నూతన శిఖరాలకు చేరుకుంటుందన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:
‘‘రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) అధ్యక్షుడు శ్రీ రబీ లామిఛానే, ఆ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీ బాలేంద్ర షాతో టెలిఫోన్‌లో మాట్లాడాను.
నేపాల్ ఎన్నికల్లో గెలుపొందిన ఇద్దరు నాయకులకు, ఘన విజయం సాధించిన ఆర్ఎస్‌పీకీ అభినందనలు తెలియజేశాను. త్వరలో ఏర్పాటు కానున్న నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపాను. అలాగే రెండు దేశాల పరస్పర సంక్షేమం, పురోగతి, శ్రేయస్సు కోసం కలసి పనిచేయడానికి భారత ప్రభుత్వ నిబద్దతను తెలియజేశాను.
మా ఉమ్మడి ప్రయత్నాలతో రానున్న కాలంలో భారత్–నేపాల్ మధ్య సంబంధాలు నూతన శిఖరాలకు చేరుకుంటాయని విశ్వసిస్తున్నాను.
***
Had warm telephone conversations with Mr. Rabi Lamichhane, Chairman of the Rastriya Swatantra Party (RSP) and Mr. Balendra Shah, Senior Leader of the RSP.
— Narendra Modi (@narendramodi) March 9, 2026
Congratulated both leaders on their electoral victories and RSP’s resounding success in the Nepal elections. Conveyed my…
राष्ट्रिय स्वतन्त्र पार्टी (रास्वपा) का सभापति श्री रवि लामिछाने र रास्वपाका वरिष्ठ नेता श्री बालेन्द्र शाहसँग टेलिफोनमा सौहार्दपूर्ण कुराकानी भयो।
— Narendra Modi (@narendramodi) March 9, 2026
वहाँहरुको निर्वाचनमा प्राप्त जित र नेपालको निर्वाचनमा रास्वपाको शानदार सफलताका लागि दुवै नेताहरूलाई बधाई दिएँ। वहाँहरूको आगामी…