పిఎంఇండియా
నేను ఒక విషయం కచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను. దేశాన్ని ముక్కలుగా భావించే హక్కును రాజ్యాంగం ఇక్కడ కూర్చున్న మనలో ఎవరికీ ఇవ్వలేదు. మనం తీసుకున్న ప్రమాణం… దేశాన్ని ఒకటిగా భావించాలని నిర్దేశిస్తుంది. అది కాశ్మీర్ అయినా, కన్యాకుమారి అయినా, మనం దేశాన్ని వేర్వేరు భాగాలుగా ఆలోచించలేం, విభజించి నిర్ణయాలూ తీసుకోలేం. కేవలం రాజకీయ లబ్ధి కోసం చేసే ఏమాత్రం నిజం లేని నిరాధార ఆరోపణల గురించి… ఈ సభలోని ఈ పవిత్ర స్థానం నుంచి నేను పూర్తి బాధ్యతతో స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. అది దక్షిణం, ఉత్తరం, తూర్పు, పశ్చిమ ప్రాంతాలైనా… చిన్న రాష్ట్రాలైనా… పెద్ద రాష్ట్రాలైనా… ఈ నిర్ణయ ప్రక్రియ ఎవరిపైనా వివక్ష చూపదని, ఎవరికీ అన్యాయం చేయదని నేను బాధ్యతతో చెబుతున్నాను. మునుపటి ప్రభుత్వాల హయాంలో ఏ డీలిమిటేషన్లు జరిగినా, అప్పటి నుంచి ఏ నిష్పత్తులను అనుసరించినా, ఆ నిష్పత్తుల్లో ఎటువంటి మార్పూ ఉండదు. ఏదైనా పెరుగుదల ఉన్నా అది అదే నిష్పత్తిలో ఉంటుంది. ఇక్కడ ‘హామీ‘ అనే పదం అవసరమైతే, నేను హామీ అనే పదాన్నే ఉపయోగిస్తాను. మీకు ‘వాగ్దానం‘ అనే పదం కావాలంటే, నేను వాగ్దానం అనే పదాన్నే ఉపయోగిస్తాను. తమిళంలో మంచి పదం ఏదైనా ఉంటే, దాన్నీ వాడటానికీ నేను సిద్ధంగా ఉన్నాను. ఉద్దేశం స్పష్టంగా ఉన్నప్పుడు, మనం పదాలతో ఆడుకోవాల్సిన అవసరం ఉండదు.
సభలోని సహచరులందరికీ నేను చెప్పదలుచుకున్నదేమిటంటే… మనం భ్రమల్లో, అహంకారంతో ఉండిపోకూడదు. నేను ‘మనం’ అనే పదాన్ని వాడుతున్నాను. ‘నేను’, ‘మీరు’ అని మాట్లాడటం లేదు. దేశంలోని మహిళా శక్తికి మనం ఏదో ఇస్తున్నామనే భ్రమలో ఉండిపోకూడదు. అది వారి హక్కు. దాన్ని మనం ఎన్నో దశాబ్దాలుగా అడ్డుకున్నాం. మనం చేసిన తప్పును సరిద్దిదుకోవడం ద్వారా ఈ రోజు ఆ పాపం నుంచి మనల్ని మనం విముక్తి చేసుకునే అవకాశం లభించింది. దీనిని అడ్డుకోవడానికి ప్రతిసారీ ఎలా కుట్రలు పన్నారో, ఎలాంటి కుటిల చాకచక్యాన్ని ప్రదర్శించారో మనందరికీ తెలుసు. దీనికి ఎప్పుడూ అనుకూలమేనని మనం చెప్పాం… కానీ దీనిని అడ్డుకోవడానికి ప్రతిసారీ ఏదో ఒక సాంకేతిక సాకు చూపేవారు. ప్రతిసారీ ఇలాంటి విషయాలనే ముందుకు తెచ్చారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ను వ్యతిరేకించే ధైర్యం ఇప్పుడు ఎవరికీ లేదు. ఆ కాలం గడిచిపోయింది. మీరు అలా చేయలేరు. ఆ మాట చెప్పే ధైర్యం మీకు లేదు. ఇది చేయండి, అది చేయండి, ఇది జోడించండి వంటి సాంకేతిక సాకులతో ఇప్పుడు మీరు దేశంలోని మహిళలకు ఈ విషయాన్ని వివరించలేరు. సభలోని సంఖ్యాబలాలను కాలమే నిర్ణయిస్తుంది. ఇప్పుడు రకరకాల సాకులు, సాంకేతిక సమస్యలను చూపుతూ మనం దీనిని మూడు దశాబ్దాలుగా అడ్డుకున్నామన్నది మాత్రం నిశ్చయం. మీరు కోరుకున్నదంతా సాధించారు, ఇక దానిని వదిలేయండి! దానిని అడ్డుకోవడానికి మూడు దశాబ్దాలు సరిపోవా? మూడు దశాబ్దాలుగా మీరు దానిని ఆపారు, అయినా ఏమీ సాధించలేకపోయారు, కాబట్టి ఇప్పుడైనా చేయండి.
ఇక్కడ కొంత మంది ఇలా అనుకుంటున్నారు.
దీని వెనక ఎక్కడో మోదీ రాజకీయ స్వార్థం దాగి ఉందని ఇక్కడ కొంతమందికి అనిపిస్తోంది. వాళ్ళని మాట్లాడనివ్వండి. పాపం, ఆ మనిషి నోరు అక్కడ మూసుకుపోతుంది. బెంగాల్లో ఎవరూ అతన్ని మాట్లాడనివ్వరు కదా.
చూడండీ… దీనిని వ్యతిరేకిస్తే, సహజంగానే నాకు రాజకీయంగా ప్రయోజనం చేకూరుతుంది. కానీ మనం కలిసి ముందుకు సాగితే, అప్పుడు ప్రత్యేకించి ఎవరికీ లాభం ఉండదు. ఇది రాసుకోండి. ఎవరికీ లాభం ఉండదు… ఎందుకంటే అప్పుడు పరిస్థితి వేరేలా ఉంటుంది. ఎవరికీ ప్రయోజనం లభించదు. మాకు గుర్తింపు అక్కర్లేదు. ఇది ఆమోదం పొందిన వెంటనే… రేపు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఒక ప్రకటన ఇవ్వడానికి, మీ అందరి ఫోటోలను ప్రచురించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ గుర్తింపు మీరే తీసుకోండి! మీకు గుర్తింపు గురించి చింత ఉంటే, తీసుకోండి. మీరు ఎవరి ఫోటోను ప్రచురించాలనుకున్నా, మేం దానిని ప్రభుత్వ ఖర్చుతో ప్రచురిస్తాం. నేను ముందు నుంచీ పూర్తి గుర్తింపును మీకే ఇస్తున్నాను.
మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మహిళల భాగస్వామ్యం కేవలం సంఖ్యాపరమైన అంశం గానీ, ప్రజాస్వామ్య ఏర్పాట్లలో ఒక పరిమిత మెరుగుదల గానీ కాదు. ఈ నిర్ణయం ప్రజాస్వామ్య మాతగా భారత్ నిబద్ధత. ఇది ఒక సాంస్కృతిక నిబద్ధత. ఈ నిబద్ధత కారణంగానే పంచాయతీల్లో ఈ ఏర్పాటు జరిగింది. ఇప్పుడు 20కి పైగా రాష్ట్రాల్లో ఇది 50 శాతానికి చేరుకుంది. మనం దీనిని అనుభవపూర్వకంగా చూశాం. చాలా కాలం పాటు, ప్రజలు నాకు ముఖ్యమంత్రిగా సేవ చేసే అవకాశాన్నిచ్చారు. ఆ కాలంలో నేను క్షేత్రస్థాయిలో మహిళా నాయకత్వాన్ని చూశాను. నా అనుభవం ప్రకారం, సమస్యలను సున్నితత్వంతో పరిష్కరించడంలో వారి నిబద్ధత చాలా ప్రభావవంతంగా ఉంది, అది అభివృద్ధి ప్రయాణానికి ఊపునిచ్చింది. ఆ అనుభవం ఆధారంగా నేను చెబుతున్నాను… ఈ సభలో వారి గొంతు ఒక కొత్త బలంగా మారుతుంది. ఒక కొత్త ఆలోచనను జోడిస్తుంది. దేశ దిశకు సున్నితత్వం చేకూరుతుంది. వాస్తవాలు, వాదనలతో కలిసినప్పుడు అనుభవం బలం అనేక రెట్లు పెరుగుతుంది. సభ సుసంపన్నమవుతుంది.
మన దేశంలో అనుభవజ్ఞులైన మహిళా శక్తికి కొరత లేదు. సమర్థులైన మహిళలకు ఏమాత్రం లోటు లేదు. మనం వారిని విశ్వసిద్దాం. వారు తమ వంతు కృషి చేస్తారు. అత్యంత అద్భుతంగా సేవలందిస్తారు. నేటికీ, ఇక్కడ మన సోదరీమణులకు ఎప్పుడు అవకాశం లభించినా, వారు తమ సామర్థ్యాన్ని చక్కగా చాటుకున్నారు. ఈ సభకు ఎంతో వన్నె తెచ్చారు.
దేశవ్యాప్తంగా ఈ రోజు 650కి పైగా జిల్లా పంచాయతీలు ఉన్నాయి. వీటిలో దాదాపు 275 పంచాయతీలకు మహిళలే నాయకత్వం వహిస్తున్నారు. కేంద్ర మంత్రివర్గంలోని మంత్రుల కంటే వీరికే అధిక బాధ్యతలు, నిధులు, నిర్వహణ అధికారాలు ఉన్నాయి. వీరు అత్యంత సమర్థవంతంగానూ పనిచేస్తున్నారు. సుమారు 6,700 మండల పంచాయతీల్లో 2,700కి పైగా పంచాయతీలకు మహిళలే సారథ్యం వహిస్తున్నారు. నేడు 900కి పైగా నగరాల్లోని పట్టణ స్థానిక సంస్థల్లో మేయర్లుగా గానీ, స్థాయీ సంఘాల అధ్యక్షులుగా గానీ మన సోదరీమణులే అధికారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ రోజు దేశం సాధిస్తున్న ప్రగతిలో వీరి భాగస్వామ్యం ఎంతో గణనీయమైనదని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను. ఆ సేవను గుర్తించి, సముచితంగా గౌరవించడానికి ఇదే సరైన సందర్భం. ఈ అనుభవం సభకు తోడైనప్పుడు, సభ బలం అనేక రెట్లు వృద్ధి చెందుతుంది.
సుదీర్ఘ నిరీక్షణ మనందరిలో ఒక సందేహాన్ని సృష్టించింది. ఈ పరిస్థితిని మనమే సృష్టించుకున్నాం. గతంలో ఉన్న పరిమితులు, ఇబ్బందుల నుంచి బయటపడి… ధైర్యంగా ముందుకు సాగి… దేశాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి ఇది ఒక చక్కటి అవకాశం. ఈ రోజు మనమంతా కలిసి నిర్ణయం తీసుకుని, ఏకగ్రీవంగా ముందుకు సాగాలని నేను గట్టిగా కోరుతున్నాను. అలా ఏకగ్రీవంగా ముందుకు సాగినప్పుడు, అధికార యంత్రాంగంపైనా ఒత్తిడి పెరుగుతుంది. ఇందులో ప్రతి ఒక్కరికీ హక్కు ఉందని, ప్రతి ఒక్కరు చెప్పే వాటిని పరిగణనలోకి తీసుకోవాలనీ, ఇందులో ఎలాంటి హానీ లేదని వారు భావిస్తారు. ఐకమత్య బలం మనకు ఎన్నో మంచి ఫలితాలనిస్తుంది.
ఎక్కువ సమయం తీసుకోకుండా, నేను ఒక్క విషయం మాత్రం చెబుతాను. దీనిని రాజకీయ త్రాసులో తూచవద్దు. మనం ఏ నిర్ణయం తీసుకున్నా సరే… మనం ఇక్కడికి తీసుకువస్తున్న వారిపైనే ఈ గొప్ప దేశ బాధ్యతలో సగ భాగం ఆధారపడి ఉంటుంది. ఇక్కడికి వచ్చే హక్కు వారికీ ఉంది. మనం వారిని అడ్డుకోకూడదు. ఇక సంఖ్యా బలాల విషయానికి వస్తే… గతంలో ఒక చర్చ జరిగింది. వారి సంఖ్యను తగ్గించకూడదు… బదులుగా మరింత పెంచాలని, అప్పుడే ప్రక్రియ వేగవంతమవుతుందనేది ఆ చర్చల సారం. ఇప్పుడు ఆ అంశమే మన ముందుకు వచ్చింది. గతంలో ఉన్న 33 శాతం సంఖ్యను పెంచాలనే చర్చ. తద్వారా ఎవరికీ తమ హక్కులు హరించుకుపోయాయని అనిపించకుండా ఉంటుంది. దీనివల్ల ఒక కొత్త బలం సమకూరుతుంది. అదనపు శక్తీ చేకూరుతుంది. సభ కూర్పులోనూ తగిన సర్దుబాట్లు జరుగుతాయి. మేం ఇప్పటికే ఆ దిశగా ఆలోచించి, అందుకు అవసరమైన వేదికను సిద్ధంగా ఉంచాం.
కాస్త సరదాగా చెప్పాలంటే… ప్రతి ఒక్కరికీ వారి సొంత రాజకీయ కారణాలు ఉంటాయన్నది వాస్తవం. ఓటమి భయం ఉండటం మాత్రం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ మన సంప్రదాయం ప్రకారం, ఏదైనా మంచి పని జరిగినప్పుడు ‘దిష్టి‘ తగలకుండా ఉండేందుకు మనం ఒక నల్ల చుక్క పెడతాం. అలా ఈ మంచి పనికీ నల్లని దిష్టి చుక్క పెట్టినందుకు మీకు నా ధన్యవాదాలు!
చాలా ధన్యవాదాలు!
గమనిక: ఇది ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి అనువాదం.
****
Speaking in the Lok Sabha. https://t.co/AsiBPaaoEg
— Narendra Modi (@narendramodi) April 16, 2026
A historic opportunity to empower our Nari Shakti. pic.twitter.com/vmJM8VVHgv
— PMO India (@PMOIndia) April 16, 2026
Including Nari Shakti in decision-making is key to building a Viksit Bharat. pic.twitter.com/RyMAIDB7UF
— PMO India (@PMOIndia) April 16, 2026
More and more women are becoming leaders at the grassroots level. pic.twitter.com/FTvEFdy3w9
— PMO India (@PMOIndia) April 16, 2026
We must not assume we are giving something to the Nari Shakti; this is their right. pic.twitter.com/H4UDhfoHy3
— PMO India (@PMOIndia) April 16, 2026
Women's participation in our parliamentary democracy is not just about numbers, but a commitment to democratic values. pic.twitter.com/LkcNFTraKs
— PMO India (@PMOIndia) April 16, 2026
हम सब भाग्यवान हैं कि हमें राष्ट्र निर्माण में देश की आधी आबादी को हिस्सेदार बनाने का सौभाग्य मिल रहा है। यह समय की मांग है कि हमारी नारी शक्ति देश के नीति-निर्धारण का हिस्सा बने। pic.twitter.com/O0szhVSSbD
— Narendra Modi (@narendramodi) April 16, 2026
पिछले 25-30 वर्षों में लाखों महिलाएं ग्रास रूट लेवल पर लीडर और ओपिनियन मेकर बन चुकी हैं। इसलिए अब उनका विरोध करने वालों को लंबे समय तक इसकी कीमत चुकानी पड़ेगी। pic.twitter.com/0LYRfhQope
— Narendra Modi (@narendramodi) April 16, 2026
देश की नारी शक्ति को आरक्षण राष्ट्रहित का निर्णय है, जिसमें माताएं-बहनें और बेटियां हमारी नीयत को देखेंगी। इसलिए इसे राजनीति के तराजू से मत तोलिए। pic.twitter.com/YvINomHTTG
— Narendra Modi (@narendramodi) April 16, 2026
हम इस भ्रम में न रहें कि देश की नारी शक्ति को कुछ दे रहे हैं, बल्कि ये उसका हक है। हमारी भावना क्रेडिट लेने की नहीं, बल्कि महिलाओं को और सशक्त बनाने की है। pic.twitter.com/zN8ktiYMzf
— Narendra Modi (@narendramodi) April 16, 2026
हमारे देश में अनुभवी नारी शक्ति की कोई कमी नहीं है। हमें भरोसा है कि वे सदन के साथ-साथ राष्ट्र को समृद्ध करने में अपना अमूल्य योगदान देंगी। pic.twitter.com/TR6bdBHWBB
— Narendra Modi (@narendramodi) April 16, 2026