పిఎంఇండియా
కిందటి సంవత్సరం ఇదే రోజున పహల్గామ్లో జరిగిన భయంకర ఉగ్రవాద దాడిలో ప్రాణాలను కోల్పోయిన అమాయకులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు నివాళులు అర్పించారు. బాధితులను ప్రధానమంత్రి స్మరించుకుంటూ వారిని ఎప్పటికీ మరువబోమన్నారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబాల వెన్నంటి నిలవాలన్న దేశ ప్రజల అచంచల నిబద్ధతను ప్రధాని పునరుద్ఘాటించారు.
కష్టకాలంలో భారత్ ఏకతాటి మీద నిలిచిందనీ, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకున్న సంకల్పం దృఢతరమైందనీ శ్రీ మోదీ తెలిపారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నప్పటికీ భారత్ ఎన్నటికీ తలొగ్గదనీ, ఉగ్రవాదుల కుతంత్రాలు ఎన్నటికీ ఫలించవనీ ఆయన పునరుద్ఘాటించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ –
‘‘కిందటేడాదిలో ఇదే రోజున పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో ప్రాణాలను కోల్పోయిన సామాన్యులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. వారిని మరచిపోవడం ఎన్నటికీ జరగదు. ఈ నష్టం నుంచి కోలుకొనేందుకు ప్రయత్నిస్తున్న బాధిత కుటుంబాలకు నేను సంతాపాన్ని తెలియజేస్తున్నాను.
ఒక దేశ ప్రజలుగా దుఃఖ సమయంలో దృఢసంకల్పంతో ఒక్కటిగా నిలుద్దాం. ఉగ్రవాదం ఏ రూపాన్ని ధరించి తెగబడినా సరే, దాని ఎదుట భారత్ ఏనాటికీ తల వంచదు. ఉగ్రవాదుల క్రూర ప్రణాళికలు ఎప్పటికీ సఫలం కానే కావు’’ అని పేర్కొన్నారు.
***
Remembering the innocent lives lost in the gruesome Pahalgam terror attack on this day last year. They will never be forgotten. My thoughts are also with the bereaved families as they cope with this loss.
— Narendra Modi (@narendramodi) April 22, 2026
As a nation, we stand united in grief and resolve. India will never bow to…