పిఎంఇండియా
పాదరక్షల పరిశ్రమలో సాంకేతిక వస్త్రాల పాత్రను, అనుసంధానాన్ని వివరిస్తూ కేంద్రమంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ రాసిన ఓ వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు పంచుకున్నారు.
పాదరక్షల తయారీలో సాంకేతిక వస్త్రాల వినియోగం కేవలం ఇప్పుడిప్పుడే వస్తున్న ఆలోచన కాదని, అది ఇప్పటికే ఈ పరిశ్రమలో అంతర్భాగమైందనే సరళమైన, శక్తిమంతమైన విశ్లేషణను ఈ కథనం వెల్లడిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘పాదరక్షల పరిశ్రమలో సాంకేతిక వస్త్రాల వినియోగం అనేది కొత్తగా పుట్టుకొచ్చిన అంశం కాదని, అది ఇప్పటికే ఈ రంగంలో అంతర్భాగమై ఉందనే సరళమైన, శక్తిమంతమైన అవగాహనను కేంద్రమంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ ఈ కథనం ద్వారా తెలియజేశారు.
ఈ అనుసంధానాన్ని గుర్తించి, వ్యవస్థీకరించి, విస్తరించడమే మన ముందున్న కర్తవ్యమని ఆయన చెప్పారు. దీని ద్వారా పాదరక్షల రంగాన్ని సాంకేతిక వస్త్రాల వ్యవస్థలోకి మరింత స్పష్టంగా తీసుకురావచ్చు’’.
***
In this article, Union Minister Shri @girirajsinghbjp brings out a simple but powerful insight that technical textiles in footwear are not an emerging concept but are already embedded in the industry.
— PMO India (@PMOIndia) April 29, 2026
He emphasises that the task ahead is to recognise, organise and scale this… https://t.co/S4vpnD8INf