Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పాదరక్షల రంగంలో సాంకేతిక వస్త్రాల అనుసంధానాన్ని వివరిస్తూ రాసిన ఓ వ్యాసాన్ని పంచుకున్న ప్రధానమంత్రి


పాదరక్షల పరిశ్రమలో సాంకేతిక వస్త్రాల పాత్రనుఅనుసంధానాన్ని వివరిస్తూ కేంద్రమంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ రాసిన ఓ వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు పంచుకున్నారు.

పాదరక్షల తయారీలో సాంకేతిక వస్త్రాల వినియోగం కేవలం ఇప్పుడిప్పుడే వస్తున్న ఆలోచన కాదనిఅది ఇప్పటికే ఈ పరిశ్రమలో అంతర్భాగమైందనే సరళమైనశక్తిమంతమైన విశ్లేషణను ఈ కథనం వెల్లడిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

‘‘పాదరక్షల పరిశ్రమలో సాంకేతిక వస్త్రాల వినియోగం అనేది కొత్తగా పుట్టుకొచ్చిన అంశం కాదనిఅది ఇప్పటికే ఈ రంగంలో అంతర్భాగమై ఉందనే సరళమైనశక్తిమంతమైన అవగాహనను కేంద్రమంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ ఈ కథనం ద్వారా తెలియజేశారు.

ఈ అనుసంధానాన్ని గుర్తించివ్యవస్థీకరించివిస్తరించడమే మన ముందున్న కర్తవ్యమని ఆయన చెప్పారు. దీని ద్వారా పాదరక్షల రంగాన్ని సాంకేతిక వస్త్రాల  వ్యవస్థలోకి మరింత స్పష్టంగా తీసుకురావచ్చు’’.

***