Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆపరేషన్ సిందూర్ సమయంలో రక్షణ బలగాల ధైర్యాన్ని తెలియజెప్పే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి


దేశ సైనికుల అసాధారణ శౌర్యానికీ, వారి దేశభక్తికీ ఆపరేషన్ సింధూర్‌లో భారత్ సాధించిన అసాధారణ విజయమే స్ఫూర్తిదాయక ఉదాహరణ అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. వారి ధైర్యానికీ, దృఢ సంకల్పానికీ, అచంచలమైన కర్తవ్య స్ఫూర్తికీ ప్రతి పౌరుడూ గర్వపడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

ప్రధానమంత్రి పంచుకున్న సంస్కృత సుభాషితం–

‘‘ఉదీర్ణమనసో యోధా వాహనాని చ భారత।

యస్యాం భవంతి సేనాయాం ధ్రువం తస్యాం జయం వదేత్।।’’

స్ఫూర్తి, ధైర్యం, మనోనిబ్బరం, గొప్ప వనరులను కలిగి ఉన్న సైన్యం కచ్చితంగా విజయం సాధిస్తుందని ఈ సుభాషితం తెలియజేస్తుంది.

సామాజిక మాధ్యమం ఎక్స్‌‌లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

‘‘మన సైనికుల అసాధారణ శౌర్యానికీ, దేశభక్తికీ ఆపరేషన్ సింధూర్‌లో భారతదేశం సాధించిన విజయం ఓ స్పూర్తిదాయకమైన ఉదాహరణ. వారి ధైర్యానికీ, సంకల్పానికీ, అంకితభావానికీ దేశంలోని ప్రతి పౌరుడూ గర్వపడుతున్నారు.

ఉదీర్ణమనసో యోధా వాహనాని చ భారత।

యస్యాం భవంతి సేనాయాం ధ్రువం తస్యాం జయం వదేత్।।