Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

హైదరాబాద్‌లో సింధు ఆస్పత్రిని ప్రారంభించిన ప్రధానమంత్రి


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హైదరాబాద్‌లో సింధు ఆస్పత్రిని ప్రారంభించారు. నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల మెరుగుకు ఈ ఆస్పత్రి చేస్తున్న కృషి అభినందనీయమని ప్రధానమంత్రి ఈ సందర్భంగా అన్నారు.

అంతేకాకుండా అధునాతన సాంకేతికతలు, ఆవిష్కరణల ప్రాధాన్యమిస్తూ వైద్య విధానాల్లో వాటిని అంతర్భాగం చేయడంపై యాజమాన్యాన్ని ప్రశంసించారు.

దీనిపై సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా ప్రజలతో పంచుకున్న సందేశంలో:

“హైదరాబాద్‌లో ఇవాళ సింధు ఆసుపత్రిని ప్రారంభించాను. ఈ నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల మెరుగుదల దిశగా ఇదొక ప్రశంసనీయ ప్రయత్నం. అత్యాధునిక సాంకేతికత-ఆవిష్కరణల అనుసంధానానికి ప్రాధాన్యంపై ఆస్పత్రి యాజమాన్యం శ్రద్ధ ఎంతయినా అభినందనీయం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

****