పిఎంఇండియా
జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
1998లో పోఖ్రాన్ పరీక్షలు విజయవంతమయ్యేందుకు శాస్త్రవేత్తలు చేసిన కృషిని, వారి అంకితభావాన్ని ప్రధానమంత్రి ఎంతో గర్వంగా గుర్తు చేసుకున్నారు. భారతదేశ శాస్త్ర సాంకేతిక నైపుణ్యాన్ని, అంచలమైన దేశ నిబద్ధతను ఆ చరిత్రాత్మక ఘట్టం ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు.
స్వావలంబన భారత్ నిర్మాణంలో సాంకేతికత కీలకంగా మారిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఆవిష్కరణలను వేగవంతం చేస్తోందని, అవకాశాలను విస్తరిస్తుందని అన్ని రంగాల్లో దేశాభివృద్ధికి తోడ్పడుతోందని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రతిభకు సాధికారత కల్పించటం, పరిశోధనలను ప్రోత్సహించటం, దేశ ప్రగతితో పాటు ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన పరిష్కారాలను రూపొందించటంపైనే నిరంతరం దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.
ఈ చరిత్రాత్మక ఘట్టాన్ని గుర్తుచేసుకుంటూ… 1998లో ఇదే రోజున పోఖ్రాన్‌లో నిర్వహించిన అణు పరీక్షలు భారతదేశ అద్భుత సామర్థ్యాలను ప్రపంచానికి పరిచయం చేశాయని ప్రధానమంత్రి తెలిపారు. దేశం గర్వించేలా చేసి, ఆత్మగౌరవాన్ని పెంపొందించిన శాస్త్రవేత్తలను నిజమైన దేశ రూపశిల్పులని కొనియాడారు.
దివ్యలోకాలకు ఉన్నతమైన శక్తి అగ్ని అని, భూమిపై సమస్త శక్తికి అదే మూలధారమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. తేజోరూపమైన అగ్ని.. పదార్థంలోని అత్యంత సూక్ష్మమైన పరమాణువుల్లో దాగున్న అపారమైన శక్తిని మేల్కొల్పి, సృష్టి అంతటా శక్తిని, చైతన్యాన్ని విస్తరించేలా చేస్తుందంటూ సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వరుస పోస్టుల్లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.
“జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. 1998లో పోఖ్రాన్ పరీక్షలు విజయవంతమయ్యేందుకు శాస్త్రవేత్తలు చేసిన కృషిని, వారి అంకితభావాన్ని స్మరించుకుందాం. భారతదేశ శాస్త్ర సాంకేతిక నైపుణ్యాన్ని, అంచలమైన దేశ నిబద్ధతను ఆ చరిత్రాత్మక ఘట్టం ప్రతిబింబిస్తుంది.
స్వావలంబన భారత్ నిర్మాణంలో సాంకేతికత కీలకంగా మారింది. సాంకేతిక పరిజ్ఞానం ఆవిష్కరణలను వేగవంతం చేయటంతో పాటు అవకాశాలను విస్తరిస్తూ అన్ని రంగాల్లో దేశాభివృద్ధికి తోడ్పడుతోంది. ప్రతిభకు సాధికారత కల్పించటం, పరిశోధనలను ప్రోత్సహించటం, దేశ ప్రగతితో పాటు ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన పరిష్కారాలను రూపొందించటంపైనే మేం నిరంతరం దృష్టి సారిస్తున్నాం”.
“1998లో ఇదే రోజున పోఖ్రాన్‌లో నిర్వహించిన అణు పరీక్షలు భారత అద్భుత సామర్థ్యాలను ప్రపంచానికి పరిచయం చేశాయి. దేశం గర్వించేలా చేసి, ఆత్మగౌరవాన్ని పెంపొందించిన శాస్త్రవేత్తలు నిజమైన దేశ రూపశిల్పులు.
అగ్నిన్‌ర్మూర్థా దివః కకుత్పతిః పృథివ్యా అయమ్
అపాం రేతాంసి జిన్వతి”
సర్వలోకాల్లో సర్వోన్నత శక్తి, భూమిపైన సమస్త శక్తికి ప్రాథమిక ఆధారం అగ్ని. ఇది పదార్థంలోని అతి సూక్ష్మకణాల్లో దాగున్న అపారమైన శక్తిని మేల్కొల్పి… సృష్టి అంతటా శక్తిని, చైతన్యాన్ని విస్తరిస్తుంది.
***
Greetings on National Technology Day. We recall with pride the hard work and dedication of our scientists, which led to the successful tests in Pokhran in 1998. That landmark moment reflected India’s scientific excellence and unwavering commitment.
— Narendra Modi (@narendramodi) May 11, 2026
Technology has become a key…
वर्ष 1998 में आज के दिन पोखरण में हुए परमाणु परीक्षण ने दुनिया को भारत के अद्भुत सामर्थ्य से परिचित कराया।
— Narendra Modi (@narendramodi) May 11, 2026
हमारे वैज्ञानिक देश के गौरव और स्वाभिमान के सच्चे शिल्पी हैं।
अग्निर्मूर्धा दिवः ककुत्पतिः पृथिव्या अयम्।
अपां रेतांसि जिन्वति॥ pic.twitter.com/ufKK8gUbtd