పిఎంఇండియా
కేంద్రమంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ రాసిన కథనాన్ని ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. సోమనాథ్ ఆలయ పటిష్ఠత, కాలాతీతమైన నాగరికత ప్రాముఖ్యతను ఈ కథనం తెలియజేస్తుంది.
సోమనాథ్ కేవలం ఆలయం మాత్రమే కాదని, భారతదేశ అచంచలమైన స్ఫూర్తికి నిదర్శనమని ప్రధానమంత్రి అన్నారు. శిథిలావస్థ నుంచి పునరుజ్జీవం వైపు సాగిన ఆలయ ప్రయాణం.. ఓటమి ఎరుగని, ధైర్యానికి ప్రతీకగా నిలిచే దేశ వారసత్వాన్ని ప్రతిబింబిస్తుందని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ పోస్టులో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“సోమనాథ్ కేవలం ఆలయం మాత్రమే కాదు, భారతదేశ అచంచలమైన స్ఫూర్తికి నిదర్శనం. శిథిలావస్థ నుంచి పునరుజ్జీవం వైపు సాగిన ఆలయ ప్రయాణం… ఓటమి ఎరుగని, ధైర్యానికి ప్రతీకగా నిలిచే దేశ వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది.
సోమనాథ్ ఆలయం పటిష్ఠత, కాలాతీతమైన నాగరికత ప్రాముఖ్యతకు సంబంధించి కేంద్రమంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ ఆలోచనలను పంచుకున్నారు. తప్పక చదవండి!”.
More than a temple, Somnath is a testament to India’s enduring spirit. From ruin to renewal, its journey reflects the unconquerable heritage of India and her undaunted legacy!
— PMO India (@PMOIndia) May 11, 2026
Union Minister Shri @gssjodhpur reflects on Somnath’s resilience and its timeless civilisational… pic.twitter.com/qfxWWwC0rv