పిఎంఇండియా
రష్యా విదేశాంగ మంత్రి శ్రీ సెర్గీ లావ్రోవ్ నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
డిసెంబర్ 2025లో 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఇరు దేశాల నేతల మధ్య జరిగిన సమావేశం తర్వాత ద్వైపాక్షిక సహకారంలో సాధించిన పురోగతి గురించి విదేశాంగ మంత్రి లావ్రోవ్ ప్రధానమంత్రికి వివరించారు.
ఉక్రెయిన్, పశ్చిమాసియాలోని పరిస్థితులతో సహా పరస్పర ఆసక్తి ఉన్న వివిధ ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై విదేశాంగ మంత్రి లావ్రోవ్, ప్రధానమంత్రి తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
సమస్యల పరిష్కారానికి చర్చలు, దౌత్యమే సరైన మార్గమని భారత్ స్థిరమైన వైఖరిని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
అధ్యక్షుడు పుతిన్‌కు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయాలని విదేశాంగ మంత్రి లావ్రోవ్ను ప్రధానమంత్రి కోరారు.