Search

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సెమీకండక్టర్ల తయారీకి సంబంధించిన ఒప్పందంపై ప్రధానమంత్రి మోదీ సమక్షంలో సంతకాలు చేసిన ఏఎస్ఎంఎల్, టాటా ఎలక్ట్రానిక్స్

సెమీకండక్టర్ల తయారీకి సంబంధించిన ఒప్పందంపై  ప్రధానమంత్రి మోదీ సమక్షంలో సంతకాలు చేసిన ఏఎస్ఎంఎల్, టాటా ఎలక్ట్రానిక్స్


గుజరాత్‌లోని ధోలేరాలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ఏర్పాటుకు సంబంధించిన ఒప్పందంపై టాటా ఎలక్ట్రానిక్స్, ఏఎస్ఎంఎల్‌లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, నెదర్లాండ్స్ ప్రధానమంత్రి శ్రీ రాబ్ జెట్టెన్‌ సమక్షంలో సంతకాలు చేశాయి. 

భారతదేశపు మొట్టమొదటి ఫ్రంట్–ఎండ్ సెమీకండక్టర్ ఫ్యాబ్ కోసం టాటా ఎలక్ట్రానిక్స్, ఏఎస్ఎంఎల్ భాగస్వామ్యం కావడాన్ని ఇరు దేశాల ప్రధానమంత్రులు స్వాగతించారు. దేశంలో సెమీకండక్టర్ వ్యవస్థను అభివృద్ధి చేసే దిశగా భారత్ ప్రయాణంలో ఈ భాగస్వామ్యం ఒక ముఖ్యమైన అడుగు అని ప్రధానమంత్రి మోదీ చెప్పారు.

ఏఎస్ఎంఎల్ ఒక డచ్ బహుళజాతి సంస్థ. సెమీకండక్టర్ చిప్‌ల తయారీలో అత్యంత కీలకమైన హై–ప్రిసిషన్ లితోగ్రఫీ పరికరాలను సరఫరా చేయడంలో ఇది ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. టాటా గ్రూప్‌నకు చెందిన అనుబంధ సంస్థ అయిన టాటా ఎలక్ట్రానిక్స్.. భారతదేశానికి చెందిన ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల తయారీ సంస్థ. ఈ సంస్థ ప్రస్తుతం గుజరాత్‌లో ఒక సెమీకండక్టర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది.

ప్రముఖ డచ్ సీఈఓలతో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ప్రధానమంత్రి చేసిన ప్రసంగాన్ని ఇక్కడ [Link] వీక్షించొచ్చు.

***