పిఎంఇండియా
సత్ప్రవర్తన ఓ దీపం లాంటిదనీ, అది ఒక వ్యక్తినే కాక పూర్తి సమాజాన్నే ప్రకాశింపచేస్తుందనీ చాటిచెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు. ఈ ఆదర్శ నడవడికను ప్రస్తుతం మన దేశ ప్రజలు ఆచరణలో పెట్టి సంపూర్ణ నిగ్రహంతోనూ, సామర్థ్యంతోనూ, కర్తవ్య పరాయణత్వంతోనూ దేశనిర్మాణంలో పాలుపంచుకుంటున్నారని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ:
‘‘శ్రేష్ఠ ఆచరణ దీపం లాంటిది.. దానితో ఒక్క వ్యక్తే ప్రకాశించడం కాకుండా పూర్తి సమాజం కూడా ప్రకాశిస్తుంది. ఈ ఆదర్శాన్ని పాటిస్తూ మన దేశ ప్రజలు పూర్తి సంయమనంతో, సామర్థ్యంతో, కర్తవ్యనిష్ఠతో దేశ నిర్మాణంలో నిమగ్నమయ్యారు.
తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ
జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తృమిహార్హసి’’
ఏమి చేయాలి, ఏమి చేయకూడదనే నిర్ణయాలను వ్యక్తిగత అభిప్రాయంపై ఆధారపడో, లేదా క్షణిక ఆవేశంలోనో తీసుకోకూడదు. ఇలాంటి నిర్ణయాలను శాస్త్రాలు చెబుతున్న సువ్యవస్థిత ప్రమాణాల ఆధారంగా తీసుకోవాలి. ఈ ప్రమాణాలే ప్రవర్తనకు దిశనీ, క్రమశిక్షణనీ అందిస్తాయి. ఇందువల్ల, వ్యక్తి ఆయా సుప్రతిష్ఠిత ప్రమాణాల ప్రకారం నడుచుకొన్నప్పుడు ఆ మనిషి ప్రవర్తన సమతౌల్యమైందిగా, సక్రమమైందిగా, అర్థవంతమైందిగా ఉంటుంది’’ అని పేర్కొన్నారు.
***
श्रेष्ठ आचरण वह दीपक है, जिससे व्यक्ति के साथ-साथ समाज भी आलोकित होता है। इसी आदर्श को अपनाते हुए हमारे देशवासी आज पूरे संयम, सामर्थ्य और कर्तव्यनिष्ठा से राष्ट्र निर्माण में जुटे हुए हैं।
— Narendra Modi (@narendramodi) May 20, 2026
तस्माच्छास्त्रं प्रमाणं ते कार्याकार्यव्यवस्थितौ।
ज्ञात्वा शास्त्रविधानोक्तं कर्म… pic.twitter.com/G3sXoqXB4Q