Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రోమ్‌లోని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) నుంచి అగ్రికోలా పతకాన్ని స్వీకరించిన ప్రధానమంత్రి

రోమ్‌లోని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) నుంచి అగ్రికోలా పతకాన్ని స్వీకరించిన ప్రధానమంత్రి


రోమ్‌లోని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహారవ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓప్రధాన కార్యాలయంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి 2026 సంవత్సరానికిగాను ప్రతిష్ఠాత్మక అగ్రికోలా పతకాన్ని ప్రదానం చేశారు. భారత్‌తో పాటు ప్రపంచస్థాయిలోనూ ఆహార భద్రతసుస్థిర వ్యవసాయంగ్రామీణాభివృద్ధి అంశాల పరిష్కారానికి ఆయన ప్రదర్శించిన నాయకత్వానికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందించారు.

ఎఫ్‌ఏఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ క్వూ డాంగ్యూ చేతుల మీదుగా ప్రధానమంత్రి ఈ అవార్డును అందుకున్నారుభారతీయులకుప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఆహార భద్రతపోషకాహార అవసరాలను తీర్చేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న భారతీయ రైతులకుభారతీయ వ్యవసాయ శాస్త్రవేత్తలకు పీఎం ఈ గౌరవాన్ని అంకితం చేశారుమానవ సంక్షేమంఆహార భద్రతసుస్థిరాభివృద్ధి పట్ల భారతదేశ నిబద్ధతకు దక్కిన గుర్తింపు ఇది అని స్పష్టం చేశారుభారత్‌లో వ్యవసాయ జీవనానికున్న ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ.. భూమాతకుభారత ప్రజలకు మధ్య ఉన్న పవిత్రమైన బంధం వ్యవసాయమని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

వ్యవసాయంలో భారత్‌ అవలంబిస్తున్న శాస్త్రీయఆవిష్కరణల ఆధారిత విధానం.. స్థిరమైనవాతావరణ మార్పులను తట్టుకోగలభవిష్యత్‌ అవసరాలకు సిద్ధంగా ఉండే వ‌్యవస్థను పెంపొందిస్తోందని ప్రధానమంత్రి తెలిపారుఈ ప్రయత్నంలో ప్రతి నీటి బొట్టుకు అధిక పంట‘ వంటి పద్ధతులుసూక్ష్మ నీటి పారుదలఖచ్చితమైన వ్యవసాయ పద్ధతులకు సంబంధించిన మిషన్ ఆధారిత విధానం వంటివి దేశ వ్యవసాయ విధానాలకు మార్గనిర్దేశం చేస్తున్నాయని చెప్పారుసాంకేతిక ఆధారిత వ్యవసాయ పరిష్కారాలను వివరిస్తూ.. డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలుఏఐ ఆధారిత సలహా వ్యవస్థలుడ్రోన్లురిమోట్ సెన్సింగ్ టెక్నాలజీలుసెన్సార్ ఆధారిత యంత్రాలు.. అధిక దిగుబడినిఅధిక ఆదాయాన్ని పొందటంలో భారత రైతులకు సహాయపడుతున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారుగత పదేళ్లలో వాతావరణ మార్పులను తట్టుకోగల సుమారు 3,000 పంట రకాలను భారత్‌ అభివృద్ధి చేసినట్లు వెల్లడించారుభారతదేశ శాస్త్రీయ ఆధారిత వ్యవసాయంముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాలకు ప్రపంచ ఆహార భద్రతను బలోపేతం చేస్తోందని ప్రధానమంత్రి తెలిపారు.

ఎఫ్‌ఏఓ వ్యవస్థాపక సభ్యుడిగా ప్రపంచ ఆహార భద్రతసుస్థిర వ్యవసాయంసుభిక్షమైన ప్రపంచాన్ని పెంపొందించేందుకుఆ సంస్థతో కలిసి పనిచేసే అవకాశం భారత్‌కు లభించటం పట్ల ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారుఇంటర్నేషనల్‌ ఇయర్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌ వేడుకల ద్వారా ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను ప్రోత్సహించటంలో భారత్‌తో కలిసి పనిచేసినందుకు ఎఫ్‌ఏఓకు కృతజ్ఞతలు తెలిపారు.

గత 30 ఏళ్లలో ఎఫ్‌ఏఓ ప్రధాన కార్యాలయానికి ఒక భారత ప్రభుత్వాధినేత వెళ్లడం ఇదే తొలిసారి.

****