పిఎంఇండియా
నిరంతర శ్రమ, ఓర్పు, దృఢ సంకల్పం.. వీటితో అతి పెద్ద లక్ష్యాలనైనా సరే, నెరవేర్చుకోవచ్చని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ప్రస్తుతం దేశ ప్రజలు ఇదే భావన నుంచి మార్గదర్శకత్వాన్ని పొంది, భారత్‌ను కొత్త శిఖరాలకు చేర్చుతున్నారని ఆయన తెలిపారు.
సంస్కృత భాషలో ఉన్న ఈ కింది సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి పంచుకున్నారు.
‘‘యో యమర్థం ప్రార్థయతే తదర్థం చేహ తే క్రమాత్
అవశ్యం స తమాప్నోతి న చేదర్థాన్ నివర్తతే’’.
‘నిర్దిష్ట లక్ష్యాన్ని ఆశించడం, లేదా దాని కోసం ప్రార్థించే వ్యక్తి, నిరంతరాయంగా, క్రమబద్ధంగా ప్రయత్నిస్తే ఆ లక్ష్యాన్ని తప్పక సాధిస్తారు. ఇందులో అనుమానం అక్కర్లేదు. అయితే, అందుకోసం ఆ వ్యక్తి సాధనను మధ్యలో వదలిపెట్టకుండా, తన దారి నుంచి వెనుదిరగకుండా ఉండాలి సుమా’ అని ఈ సుభాషితం మనకు బోధిస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ :
‘‘నిరంతర ప్రయత్నం, ధైర్యం, దృఢ సంకల్పం.. వీటితో ఎంత పెద్ద లక్ష్యాన్నైనా సక్రమంగా తప్పక నెరవేర్చుకోవడం సాధ్యపడుతుంది. ప్రస్తుతం దేశ ప్రజలు ఇదే భావనతో భారత్‌ను కొత్త శిఖరాల వైపునకు తీసుకుపోతున్నారు.
‘‘యో యమర్థం ప్రార్థయతే తదర్థం చేహ తే క్రమాత్
అవశ్యం స తమాప్నోతి న చేదర్థాన్ నివర్తతే’’ అని పేర్కొన్నారు.
***
निरंतर प्रयास, धैर्य और दृढ़ संकल्प के साथ बड़े से बड़े लक्ष्य को हासिल किया जा सकता है। आज देशवासी इसी भावना से भारतवर्ष को नई ऊंचाइयों की ओर ले जा रहे हैं।
— Narendra Modi (@narendramodi) May 27, 2026
यो यमर्थं प्रार्थयते तदर्थं चेह ते क्रमात् ।
अवश्यं स तमाप्नोति न चेदर्थान् निवर्तते ।। pic.twitter.com/lFBqTuZ46N