పిఎంఇండియా
కొంతమంది ఏదైనా పనిని పూర్తి చేయడంలో చేయితిరిగిన వారై ఉంటారనీ, మరికొందరు ముఖ్యంగా నైపుణ్యాన్ని, లేదా జ్ఞానాన్ని ఇతరులకు బోధించడంలో ప్రవీణులై ఉంటారనీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ రెండు గుణాల్నీ .. అంటే తాను స్వయంగా సంపాదించిన విశేష ప్రజ్ఞతో పాటు, ఇతరులకు నేర్పించగల సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటే అప్పుడు అలాంటి వ్యక్తి సర్వశ్రేష్ఠ గురువుల్లో ఒకరుగా గౌరవాన్ని పొందవచ్చునని ప్రధానమంత్రి వివరించారు.
‘‘శ్లిష్ఠా క్రియా కస్యచిదాత్మసంస్థా సడంక్రాన్తిపయితవ్య ఏవ
యస్యోభయం సాధు స శిక్షకాణాం ధురి ప్రతిష్ఠాపయితవ్య ఏవ’’ అని సంస్కృత భాషలో ఉన్న ఓసుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి పంచుకున్నారు.
కొందరు వ్యావహారంలో నిపుణలైతే, మరి కొందరు బోధనలో నిపుణులుగా ఉంటారు. అదే.. ఒక వ్యక్తి ఏదైనా విషయంలో ప్రావీణ్యం కలిగివుండడంతో పాటు ఆ ప్రావీణ్యాన్ని పరులకు ప్రభావవంతమైన పద్ధతిలో బోధించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉన్నప్పుడు, అలాంటి వ్యక్తి.. గురువుల్లో అగ్రగణ్య స్థానాన్ని అందుకొనే అర్హతను పొందుతారని ఈ సుభాషితం సూచిస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘శ్లిష్ఠా క్రియా కస్యచిదాత్మసంస్థా సడంక్రాన్తిపయితవ్య ఏవ
యస్యోభయం సాధు స శిక్షకాణాం ధురి ప్రతిష్ఠాపయితవ్య ఏవ’’ అని పేర్కొన్నారు.
***
श्लिष्टा क्रिया कस्यचिदात्मसंस्था सङ्क्रान्तिरन्यस्य विशेषयुक्ता।
— Narendra Modi (@narendramodi) June 1, 2026
यस्योभयं साधु स शिक्षकाणां धुरि प्रतिष्ठापयितव्य एव।। pic.twitter.com/xKT12kwrRt