పిఎంఇండియా
పీఎం స్వనిధి యోజన గత ఆరు సంవత్సరాలుగా అమలవుతోందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రజల దృష్టికి తీసుకువచ్చారు. దేశవ్యాప్తంగా వీధి వ్యాపారుల జీవితాల్లో మార్పు తేవడంలో ఈ పథకం ప్రముఖ పాత్రను పోషించిందన్నారు.
ఈ పథకం పూచీకత్తు లేకుండా రుణాన్ని అందుబాటులోకి వచ్చేటట్లు చూస్తోందనీ, ఆర్థిక సేవలను అందరికీ చేరువ చేస్తోందనీ, అసంఖ్యాకంగా ఉన్న వీధి వ్యాపారులకు కొత్త అవకాశాలను కల్పిస్తోందనీ ప్రధానమంత్రి అన్నారు. పీఎం స్వనిధి యోజనను నమ్మకం, ఆత్మగౌరవంతో పాటు సాధికార ప్రధానంగా రూపుదిద్దారని ఆయన అన్నారు.
లబ్ధిదారులందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. వారి దృఢ సంకల్పాన్నీ, కష్టపడే తత్వాన్నీ ఆయన ప్రశంసించారు. వారి ప్రయత్నాలు దేశ ఆర్థిక వ్యవస్థను నిరంతరం బలోపేతం చేస్తున్నాయని ప్రధానమంత్రి అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘పీఎం స్వనిధికి 6 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈ రోజు మనం పండుగ చేసుకుంటున్నాం. ఈ పథకం పూచీకత్తు లేకుండా రుణాన్ని సమకూరుస్తూ, ఆర్థిక సేవల్ని చెంతకు చేరుస్తూ, అభివృద్ధికి కొత్త అవకాశాల్ని అందిస్తూ అసంఖ్యాకంగా ఉన్న వీధి వ్యాపారుల జీవితాల్లో పెనుమార్పుల్ని తీసుకువచ్చింది. ఈ పథకం నమ్మకం, ఆత్మగౌరవంతో పాటు సాధికారత కల్పన ప్రధానంగా అమలవుతోంది. ఈ పథకం లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారి దృఢసంకల్పం, కష్టపడే తత్వం మన దేశ ఆర్థిక వ్యవస్థను నిరంతరాయంగా పటిష్టపరుస్తున్నాయి’’ అని పేర్కొన్నారు.
***
Today we mark #6YearsofPMSVANidhi, a scheme which has transformed the lives of countless street vendors by ensuring access to collateral-free credit, financial inclusion and new opportunities for growth. This scheme is all about trust, dignity and empowerment. My best wishes to… https://t.co/M4N8J9UoqK
— Narendra Modi (@narendramodi) June 1, 2026