పిఎంఇండియా
ముని పతంజలికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు నివాళులు అర్పించారు. యోగా ప్రయోజనాలను తెలియజేసే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి పంచుకున్నారు. యోగాను క్రమం తప్పక అభ్యసిస్తూ ఉంటే మనిషి శరీరం ఆరోగ్యంగా ఉండడంతో పాటు మనిషి మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందని శ్రీ మోదీ అన్నారు. దినచర్యలో యోగాను ఒక భాగంగా చేసుకొంటే అది జీవితాన్ని సమతౌల్యంగా, శక్తిమంతంగా తీర్చిదిద్దుతుందని ఆయన వివరించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘యోగాను క్రమం తప్పక అభ్యసించడం వల్ల తనువును ఆరోగ్యంగానూ, మనస్సును శాంతంగానూ ఉంచుకోవచ్చు. దీనిని మీ దినచర్యలో ఒక భాగంగా చేసుకోవడం వల్ల, ఇది జీవితాన్ని సమతౌల్యంగానూ, శక్తిమంతంగానూ మార్చుతుంది.
యోగేన చిత్తస్య పదేన వాచాం
మలం శరీరస్య చ వైద్యకేన
యోపాకరోత్ తం పరవరం మునీనాం
పతంజలిం ప్రాంజలిరానతోస్మి..
ధ్యానమగ్నులైన మునులందరిలోకీ అత్యున్నత స్థానంలో నిలిచిన ముని పతంజలికి ముకుళిత హస్తుడినై, శిరసును వంచి ప్రణామం చేస్తున్నాను. యోగాభ్యాసం ద్వారా ఆయన చిత్తంలో కల్మషాన్నీ, వ్యాకరణ ద్వారా వాణిలో కల్మషాన్నీ, ఆయుర్వేదం ద్వారా శరీరంలో మాలిన్యాన్నీ దూరం చేసుకున్నారు’’ అని పేర్కొన్నారు.
***
योग का नियमित अभ्यास तन को स्वस्थ और मन को शांत रखता है। इसे अपनी दिनचर्या का हिस्सा बनाने से जीवन संतुलित और ऊर्जावान बनता है।
— Narendra Modi (@narendramodi) June 4, 2026
योगेन चित्तस्य पदेन वाचां
मलं शरीरस्य च वैद्यकेन।
योऽपाकरोत् तं प्रवरं मुनीनां
पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि॥ pic.twitter.com/tFHwiQSURk