Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత్‌పై మరింత లోతైన నమ్మకాన్ని పెంపొందించుకోవడంలో వచ్చిన మార్పు, దేశ పరివర్తనాత్మక ప్రయాణాన్ని ప్రముఖంగా వివరిస్తూ మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ రాసిన వ్యాసాన్ని పంచుకున్న ప్రధానమంత్రి


మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ రాసిన ఒక ప్రత్యేక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రజలతో పంచుకున్నారు.

గడచిన 12 సంవత్సరాల్లో ‘భారత్‌ను కేవలం అర్థం చేసుకోవటం’ అనే భావన నుంచి భారత్‌పై మరింత లోతైన నమ్మకాన్ని పెంపొందించుకోవడం‘ వైపు స్పష్టమైన మార్పు వచ్చిన తీరును ఈ వ్యాసం తెలియజేస్తోందిదేశ పరివర్తనాత్మక ప్రయాణాన్ని విజయవంతంగా ముందుకు నడిపిస్తూనే ప్రజలతో బలమైన విశ్వాస బంధాన్ని నిరంతరం కాపాడుకుంటూ రావడం‌లోనే శ్రీ నరేంద్ర మోదీ సుదీర్ఘ పదవీకాలం శాశ్వత విజయం దాగి ఉందని ఇది స్పష్టం చేస్తోంది.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:

మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ రాసిన ఈ కథనం.. నిర్విరామంగా అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగుతున్న ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన భారత ప్రధానమంత్రిని అభినందిస్తోందిగడచిన 12 సంవత్సరాలు.. ‘భారత్‌ను కేవలం అర్థం చేసుకోవటం‘ అనే భావన నుంచి భారత్‌పై మరింత లోతైన నమ్మకాన్ని పెంపొందించుకోవడం‘ వైపు ఎలా ఒక స్పష్టమైన మార్పును తీసుకువచ్చిందీ ఇది తెలియజేస్తోందిదేశ మార్పు దిశగా జరిగిన ప్రయాణాన్ని ముందుకు నడిపిస్తూనే ప్రజలతో బలమైన విశ్వాస బంధాన్ని నిరంతరం కాపాడుకుంటూ రావడం‌లోనే ప్రధాని మోదీ శాశ్వత విజయం దాగి ఉందని ఆయన తన వ్యాసంలో పేర్కొన్నారు.”

***