పిఎంఇండియా
శ్రీ జస్పాల్ రాణా గారి మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఆయన మరణం భారత క్రీడాజగతికి తీరని లోటు అని ప్రధాని అన్నారు.
షూటింగ్ క్రీడావిభాగంలో అసాధారణ విజయాలతో శ్రీ జస్పాల్ రాణా దేశానికి కీర్తిని తెచ్చిపెట్టారని శ్రీ మోదీ అన్నారు. యువ క్రీడాకారులకు ఒక గురువుగా గొప్ప అంకిత భావంతో వారిని తీర్చిదిద్ది, మార్గదర్శిగా నిలవడంలో ఆయన అందించిన తోడ్పాటు అంతే ప్రశంసనీయమని ప్రధానమంత్రి తెలిపారు. శ్రేష్ఠత్వ సాధనలో చాటిన అచంచల నిబద్ధత, క్రమశిక్షణ, క్రీడాప్రపంచానికి చేసిన సేవలు ఆయనకు అపార ప్రశంసలను సంపాదించిపెట్టాయని ప్రధాని అన్నారు.
ఈ విషాద సమయంలో శ్రీ జస్పాల్ రాణా కుటుంబానికీ, స్నేహితులకీ, క్రీడాకారులకూ ప్రధానమంత్రి సంతాపాన్ని తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ :
‘‘శ్రీ జస్పాల్ రాణా గారి మృతి విచారకరం. ఆయన నిష్క్రమణ భారత క్రీడా లోకానికి తీరని లోటు.
షూటింగ్ క్రీడావిభాగంలో అసాధారణ విజయాలతో దేశానికి అపార యశస్సును సాధించి పెట్టారాయన. యువ క్రీడాకారులకు గొప్ప అంకిత భావంతో మార్గదర్శకత్వం వహించి వారిని తీర్చిదిద్దడంలో ఒక గురువుగా ఆయన అందించిన తోడ్పాటు కూడా అంతే ప్రశంసనీయం. ప్రావీణ్య సాధన పట్ల తిరుగులేని నిబద్ధత, క్రమశిక్షణ, క్రీడాప్రపంచానికి చేసిన సేవలూ ఆయనకు అపార ప్రశంసల్ని సంపాదించిపెట్టాయి.
ఆయన కుటుంబానికీ, మిత్రులకూ, పూర్తి క్రీడాలోకానికీ ఈ దుఃఖ ఘడియలో నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఓమ్ శాంతి’’ అని పేర్కొన్నారు.
Deeply saddened by the passing of Shri Jaspal Rana Ji. His passing is a profound loss to the world of Indian sports.
He brought immense glory to the nation through his extraordinary achievements in shooting. Equally remarkable was his contribution as a mentor, shaping and…
— Narendra Modi (@narendramodi) June 12, 2026
***
MJPS/SS/PRK