Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పశ్చిమాసియాలో ఘర్షణకు ముగింపు పలికేలా అమెరికా – ఇరాన్‌ మధ్య కుదిరిన అవగాహనను స్వాగతించిన ప్రధాని


పశ్చిమాసియాలో ఘర్షణను ముగించే విషయంలో అమెరికా – ఇరాన్ మధ్య కుదిరిన అవగాహనను భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు.

ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక అంతరాయాలకు ఈ ఘర్షణ కారణమైందనీఅనేక దేశాల్లో ప్రాణనష్టానికి దారితీసిందనీ ప్రధానమంత్రి పేర్కొన్నారు.

ఆ ప్రాంతంలో శాంతినీస్థిరత్వాన్నీ పునరుద్ధరించడంతోపాటు నౌకాయానవాణిజ్య స్వేచ్ఛను నెలకొల్పడంలోనూ ఈ అవగాహన దోహదపడుతుందని ప్రధానమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

మిగిలిన అంశాలపైనా చర్చలు జరిగి.. ఒక సుస్థిరమైన తుది ఒప్పందం కూడా కుదురుతుందని భారత్ ఆశిస్తోందన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక అవాంతరాలకూఅనేక దేశాల్లో ప్రాణ నష్టానికీ కారణమైన పశ్చిమాసియా ఘర్షణకు ముగింపు పలికే విషయమై అమెరికాఇరాన్ మధ్య కుదిరిన అవగాహనను స్వాగతిస్తున్నాను.

ఆ ప్రాంతంలో శాంతినీస్థిరత్వాన్నీ పునరుద్ధరించడంతోపాటు.. నౌకాయానవాణిజ్య స్వేచ్ఛను నెలకొల్పడంలోనూ ఈ అవగాహన ఎంతగానో దోహదపడుతుందని భారత్ ఆశిస్తోంది.

మిగిలిన అంశాలపైనా చర్చలు జరిగి.. ఒక సుస్థిరమైన తుది ఒప్పందం ఇరుదేశాల మధ్య కుదురుతుందని మేం భావిస్తున్నాం.” 

 

***