పిఎంఇండియా
2026 జులై 15 నుంచి ఇండియా–యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం అమల్లోకి వస్తుండటం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.
ఈ ఒప్పందం ద్వైపాక్షిక వాణిజ్యాన్నీ, పెట్టుబడులనూ ప్రోత్సహిస్తుందని ప్రధానమంత్రి అన్నారు.
భారతీయ రైతులూ, శ్రామికులూ, ఎంఎస్ఎంఈలూ, అంకురసంస్థలూ, ఆవిష్కర్తలకు అనేక అవకాశాలను ఈ ఒప్పందం అందిస్తుందని శ్రీ మోదీ చెప్పారు. అలాగే వికసిత్ భారత్ – 2047 సాకారం కావడానికి అర్థవంతమైన సహకారం అందిస్తుందన్నారు.
ఏవియన్‌లో జరుగుతున్న జీ-7 సదస్సులో పాల్గొంటున్న తాను, యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ఇద్దరూ భారత్–యూకే ఆర్థిక సంబంధాలకు అర్థవంతమైన వేగం తోడవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలియజేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా రాశారు:
‘‘భారత్– యూకే సంబంధాల్లో ఇదో చరిత్రాత్మక విజయం.
ఇండియా–యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం 2026 జులై 15 నుంచి అమల్లోకి వస్తుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.
ఈ ఒప్పందం మన ద్వైపాక్షిక వాణిజ్యాన్నీ, పెట్టుబడులనూ గణనీయంగా పెంపొందిస్తుంది.
భారతీయ రైతులూ, శ్రామికులూ, ఎంఎస్ఎంఈలూ, అంకుర సంస్థలూ, ఆవిష్కర్తలకూ ఇది అనేక అవకాశాలను అందిస్తుంది. అలాగే వికసిత్ భారత్-2047 లక్ష్యం సాకారమయ్యేందుకు అర్థవంతమైన సహకారాన్ని అందిస్తుంది.
మన ఆర్థిక సంబంధాలకు కొత్త వేగం తోడవడం పట్ల జీ-7 సదస్సు కోసం ఏవియన్‌లో ఉన్న నేనూ, పీఎం స్టార్మర్ ఇద్దరూ సహజంగానే సంతోషిస్తున్నాం.’’
***
A historic milestone for India-UK relations.
— Narendra Modi (@narendramodi) June 17, 2026
Delighted to note that the India-UK Comprehensive Economic and Trade Agreement will enter into force on 15th July 2026.
This agreement will significantly boost our bilateral trade and investment.
It will also unlock numerous… pic.twitter.com/I0bMCjdtg4