పిఎంఇండియా
కేంద్ర మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.
యువతకు అపారమైన అవకాశాలు కల్పించడం ద్వారా వారిని సాధికారత వైపు నడిపించడమే ‘వికసిత్ భారత్‘ లక్ష్యమని ఈ కథనం తెలియజేస్తోంది. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన (పీఎంవీబీఆర్‌వై).. దేశంలో భారీ స్థాయిలో ఉపాధి అవకాశాల సృష్టికి, మార్పునకు బాటలు వేయడమే కాకుండా దేశ నిర్మాణంలో యువత క్రియాశీల భాగస్వాములు కావడానికి ఒక చోదక శక్తిగా నిలుస్తుందని ఈ వ్యాసంలో కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:
“యువతకు అపారమైన అవకాశాలు కల్పించడం ద్వారా వారిని సాధికారిత వైపు నడిపించడమే ‘వికసిత్ భారత్‘ ప్రధాన లక్ష్యం. దేశంలో భారీ స్థాయిలో ఉపాధి అవకాశాల సృష్టికి, మార్పునకు పీఎంవీబీఆర్‌వై బాటలు వేయనుంది. ఈ పథకం మన యువత దేశ నిర్మాణంలో క్రియాశీల భాగస్వాములు కావడానికి ఒక అద్భుత చోదక శక్తిగా కూడా నిలుస్తుంది.
కేంద్ర మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ రాసిన ఈ వ్యాసం ప్రతి ఒక్కరూ తప్పక చదవండి.”
***
Empowering the youth with innumerable opportunities remains the core vision for a Viksit Bharat. The PMVBRY is set to foster large-scale job creation and transformation. This scheme shall also work as an enabler for the young minds to become active participants in… https://t.co/DMkzpbHF6Z
— PMO India (@PMOIndia) June 19, 2026