Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రముఖ నేపథ్య గాయని ఎస్. జానకి అమ్మ మృతిపట్ల విచారం వ్యక్తం చేసిన ప్రధాని


ప్రముఖ నేపథ్య గాయని ఎస్జానకి అమ్మ మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

సంగీత, సాంస్కృతిక ప్రపంచానికి ఆమె మరణం తీరని లోటని ప్రధానమంత్రి పేర్కొన్నారువివిధ భాషల్లో ఆమె పాడిన పాటలు తరతరాలుగా ప్రజాదరణ పొందాయని.. అసమానమైన హుందాతనంబహుముఖ ప్రజ్ఞతో ఆమె ప్రతి భావానికి జీవం పోశారని ఆయన కొనియాడారు.

ఆమె మధురమైన గళం ఇక ముందు కూడా శ్రోతలను అలరిస్తూనే ఉంటుందని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:

ప్రముఖ నేపథ్య గాయని ఎస్జానకి అమ్మ పరమపదించడం సంగీతసాంస్కృతిక ప్రపంచానికి తీరని లోటువివిధ భాషల్లో ఆమె పాడిన పాటలు తరతరాలుగా ప్రజాదరణ పొందాయిఅసమానమైన హుందాతనంబహుముఖ ప్రజ్ఞతో ఆమె ప్రతి భావానికి తన గళం ద్వారా జీవం పోశారుఆమె మధురమైన గళం రాబోయే కాలంలోనూ శ్రోతలను అలరిస్తూనే ఉంటుందిఈ దుఃఖ సమయంలో ఆమె కుటుంబ సభ్యులకుఅసంఖ్యాక అభిమానులకుమొత్తం సంగీత ప్రపంచానికి నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నానుఓం శాంతి.”