పిఎంఇండియా
హర్యానాలోని జింద్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు సంబంధించిన దృశ్యాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీపంచుకున్నారు. ఈ చారిత్రక ప్రదేశానికి రావడం పట్ల ఆయన ఎనలేని ఆనందాన్ని వ్యక్తం చేశారు. జింద్ ప్రాంతానికి ఉన్న సుసంపన్నమైన చారిత్రక ప్రాధాన్యతను, యుద్ధ వీరుల పరాక్రమ వారసత్వాన్ని, ఆధ్యాత్మిక వైభవాన్ని కొనియాడారు. శక్తిపీఠమైన శ్రీ జయంతి దేవి అమ్మవారి దివ్య ఆశీస్సులు ఈ నేలకు లభించడం ఇక్కడి ప్రజల ప్రత్యేక అదృష్టమని అన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా చేసిన వరుస పోస్టుల్లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
పర్యావరణహిత రవాణా రంగంలో భారత్ ఒక అద్భుతమైన మైలురాయిని అధిగమించింది.
హర్యానా పర్యటనలో భాగంగా జింద్-సోనిపట్ మధ్య నడవనున్న దేశపు మొట్టమొదటి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన హైడ్రోజన్ ఇంధన రైలును జెండా ఊపి ప్రారంభించారు.
ఈ అసాధారణమైన విజయం భారతీయ రైల్వే బృందం అంకితభావానికి, అపారమైన నైపుణ్యానికి నిదర్శనం. ఆత్మనిర్భర్ భారత్ సంకల్పానికి, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా పర్యావరణహిత రవాణా వ్యవస్థను నిర్మించాలనే తమ నిబద్ధతకు ఈ హైడ్రోజన్ రైలు ఒక గర్వకారణం
హర్యానాలోని జింద్‌లో దేశ చరిత్రలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభించడం నాకు గర్వంగా ఉంది. స్వచ్ఛమైన, పచ్చని, స్వయం సమృద్ధ ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో ఇది ఒక అద్భుతమైన విజయం. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన ఈ రైలు దేశ సాంకేతిక సామర్థ్యానికి నిదర్శనంగా నిలవడమే కాకుండా యావత్ ప్రపంచానికి ఒక గొప్ప ఆదర్శంగా మారుతుంది.
జింద్ అభివృద్ధి కార్యక్రమంలో మా హర్యానా కుటుంబ సభ్యులు చూపిన ఉత్సాహం మాలో నూతన శక్తిని నింపింది.
జింద్-సోనిపట్ మధ్య పరుగు తీసే ఈ తొలి హైడ్రోజన్ రైలు 21వ శతాబ్దపు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో భారత్ వేసిన అతి పెద్ద ముందడుగు. ఈ రైలు అసాధారణ సామర్థ్యం గురించి తెలిస్తే ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది.
2014 సంవత్సరానికి పూర్వపు పరిస్థితులే గనుక ప్రస్తుతం ఉండి ఉంటే.. ప్రపంచ చమురు సంక్షోభం కారణంగా భారతదేశ రైల్వే వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోయేది. అయితే మా ప్రభుత్వం సమస్యలను ముందే ఊహించి వాటికి తగిన శాశ్వత పరిష్కారాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తోంది. ఈ ముందుచూపుతో కూడిన విధానాల ఫలితాలను నేడు దేశవ్యాప్తంగా ప్రజలు కళ్లారా చూస్తున్నారు.
హర్యానాలోని డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఇక్కడి క్రీడాకారులకు అన్ని రకాల అత్యాధునిక సౌకర్యాలను కల్పిస్తోంది. రాబోయే ప్రతిష్టాత్మక అంతర్జాతీయ క్రీడా పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి దేశ కీర్తి పతాకాన్ని ఎగురవేయాలని రాష్ట్ర యువ క్రీడాకారులకు నా విజ్ఞప్తి.
***
India takes a major leap towards green mobility!
— Narendra Modi (@narendramodi) July 17, 2026
In Jind, flagged off India’s first indigenous hydrogen-powered train between Jind and Sonipat.
This remarkable achievement reflects the ingenuity and dedication of the Indian Railways team. It is a proud symbol of Aatmanirbhar… pic.twitter.com/hVo89u5vvI
India takes a major leap towards green mobility!
— Narendra Modi (@narendramodi) July 17, 2026
In Jind, flagged off India’s first indigenous hydrogen-powered train between Jind and Sonipat.
This remarkable achievement reflects the ingenuity and dedication of the Indian Railways team. It is a proud symbol of Aatmanirbhar… pic.twitter.com/hVo89u5vvI
जींद के विकास कार्यक्रम में हरियाणा के अपने परिवारजनों का उत्साह नई ऊर्जा से भर गया। pic.twitter.com/rEYJaiXs2k
— Narendra Modi (@narendramodi) July 17, 2026
जींद से सोनीपत के बीच शुरू हुई देश की पहली हाइड्रोजन ट्रेन 21वीं सदी की टेक्नोलॉजी की दिशा में भारत का एक बड़ा कदम है। इस ट्रेन के सामर्थ्य के बारे में सुनकर हर देशवासी को बहुत गर्व होगा! pic.twitter.com/KCkeftRuk4
— Narendra Modi (@narendramodi) July 17, 2026
आज अगर 2014 से पहले की स्थिति होती तो वैश्विक तेल संकट से भारत की रेल व्यवस्था ठप पड़ जाती। लेकिन हमारी सरकार बहुत पहले सोचती भी है और समस्या का समाधान भी जमीन पर उतारती है, जिसके सुपरिणाम देश देख रहा है। pic.twitter.com/DYRAb4tUEy
— Narendra Modi (@narendramodi) July 17, 2026
हरियाणा की डबल इंजन सरकार स्पोर्ट्स में भी यहां के बेटे-बेटियों को हर सुविधा दे रही है। आने वाली महत्वपूर्ण स्पर्धाओं के लिए राज्य के युवा साथियों से मेरा यह विशेष आग्रह… pic.twitter.com/XtQONRPr8m
— Narendra Modi (@narendramodi) July 17, 2026